టీవీ9పై పంచ్ పేల్చిన రాజమౌళి!

టీవీ9పై పంచ్ పేల్చిన రాజమౌళి!“ఆర్ఆర్ఆర్” సినిమా ప్రమోషన్స్ నిమిత్తం ఈ రోజు చిత్ర యూనిట్ బెంగుళూర్ వెళ్ళింది. ముంబై ఈవెంట్ కు మిస్ అయిన రామ్ చరణ్ ఈ కార్యక్రమానికి హాజరు కాగా, మీడియా వేసిన పలు ప్రశ్నలకు చిత్ర యూనిట్ బదులిచ్చింది. ఈ క్రమంలోనే టీవీ9కు దిమ్మతిరిగే సమాధానంతో పంచ్ ఇచ్చారు మన దర్శక దిగ్గజం రాజమౌళి.

‘నెక్స్ట్ కన్నడ హీరోతో మూవీ చేస్తారా?’ అని టీవీ9 కన్నడ మీడియా ఛానల్ రాజమౌళిని ప్రశ్నించగా, మీరు ఏ ఛానల్ నుండి అని అడిగారు. ‘టీవీ9 కన్నడ’ అని విలేఖరి బదులివ్వగా, ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పగలను, కానీ ఇప్పుడు చెప్పను అంటూ కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు జక్కన్న.

ADVERTISEMENT

ఈ ప్రశ్నకు జవాబిస్తే… మీరు ‘ఆర్ఆర్ఆర్’ని పక్కన పెట్టి, అది హెడ్ లైన్స్ లో రాస్తారని, అప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ పక్కకి వెళ్ళిపోతుందని, ఈ సినిమా రిలీజ్ అయ్యి అంతా ముగిసిన తర్వాత మళ్ళీ చిట్ చాట్ చేసినపుడు ఖచ్చితంగా చెప్తాను, ఇప్పుడైతే కాదని రాజమౌళి ఇచ్చిన సమాధానానికి ఆడిటోరియం ఫిదా అయ్యింది.

టీవీ9పై పడ్డ ఈ పంచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో టీవీ9 పై నెటిజన్లలో ఇంత వ్యతిరేకత ఉందా? అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. బహుశా రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న అధికార పక్షాలను తన భుజస్కంధాలపై టీవీ9 వేసుకోవడం ఇందుకు ఓ కారణం కావచ్చు.

అలాగే గతంలో పవన్ – శ్రీరెడ్డి ఎపిసోడ్స్ సమయంలో టీవీ9ను బాయ్ కాట్ చేయాలంటూ పవన్ ఫ్యాన్స్ పిలుపునిచ్చిన ప్రభావం కావచ్చు. రాజమౌళి కూడా ప్రత్యేకంగా ఏ మీడియా అని అడిగి మరీ బదులివ్వడంలో ఆంతర్యం ఏమిటి? టీవీ9పై జక్కన్నకు కూడా ఓ ‘స్పెషల్’ అభిప్రాయం ఉన్నట్లే కదా!

ADVERTISEMENT
Latest Stories