‘ఎన్టీఆర్ – చరణ్’లలో రాజమౌళి చంపేది ఎవర్ని ?

Jr-NTR-and-Ram-Charan in RRR Climax‘ఆర్ఆర్ఆర్’ క్లైమాక్స్ విషాదాంతం. నిజమే, ‘చరణ్ – ఎన్టీఆర్’ల పాత్రల్లో ఒక పాత్ర చనిపోతుందని, చనిపోయే పాత్ర ప్రేక్షకుల హృదయాలను పిండేస్తోందని తెలుస్తోంది. ఇంతకీ, చరణ్, ఎన్టీఆర్‌ లలో రాజమౌళి చంపేది ఎవర్ని ? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయ్యింది. అసలు ప్రేక్షకులు తమ అభిమాన హీరో పాత్రను చంపేస్తే జీర్ణయించుకుంటారా ?

పైగా ‘చరణ్ – ఎన్టీఆర్’ మాస్ ఫాలోయింగ్ గురించి, వాళ్ళ హార్డ్ కొర్ ఫ్యాన్స్ మనోభావాల గురించి ప్రత్యేకంగా ముచ్చట పెట్టక్కర్లేదు. అసలు విలన్ చేతిలో చిన్న దెబ్బ తింటేనే ఎమోషనల్ అయ్యే ఫ్యాన్స్ ను రాజమౌళి ఎలా మ్యానేజ్ చేస్తాడు ? అయితే, ఫ్యాన్స్ సంగతి పక్కన పెడితే.. తెలుగు ప్రేక్షకుల అభిరుచి ఇప్పుడు మారిపోయింది. హీరోలు బతికితేనే సినిమాని హిట్ చేస్తాం అనే కోణాన్ని ప్రేక్షకులు వదిలేశారు.

ADVERTISEMENT

హీరో ఏదైనా చేయొచ్చు, ఏమైనా అవ్వొచ్చు… కానీ, ప్రతి దానికి సరైన కారణాన్ని మాత్రమే ప్రేక్షకులు ఆశిస్తున్నారు. కలర్ ఫోటోలో హీరో చనిపోయినా ఆదరించారు. పుష్పలో అల్లు అర్జున్‌ అంగవైకల్యంతో కనిపించినా ఆహా ఓహో అన్నారు. ఇక పుష్ప క్లైమాక్స్‌ లో బన్నీ బట్టలన్నీ విప్పిస్తే అదే మాస్ అయ్యింది. అన్నిటికీ మించి ఇది రాజమౌళి సినిమా.

దర్శక ధీరుడు తన సినిమాలో ఎండింగ్ ఎలా ప్లాన్ చేసినా.. అందర్నీ ఒప్పించగలడు. ఒకవేళ, హీరో పాత్ర చనిపోయినా దాన్ని కూడా చాలా ఎమోషనల్‌ గా చూపించగలడు. ‘విక్రమార్కుడు, బాహుబలి, మగధీర లాంటి సినిమాలలో హీరోను చంపేసి కూడా అద్భుతమైన విజయాలను అందుకున్నాడు జక్కన్న. కానీ ఆర్ఆర్ఆర్ కథలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్.. కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ కనిపించబోతున్నారు.

కానీ, వాస్తవిక పాత్రలకు కల్పితాలు జోడించి చేస్తున్న సినిమా ఇది. కేవలం ఏమి చేస్తే.. అద్భుతమైన ఎమోషన్స్ మనసులను కదిలిస్తాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే రాజమౌళి ఈ సినిమాని మలిచాడు. ఈ క్రమంలోనే కొన్ని వేలమంది ప్రాణాలను కాపాడటానికి ఎన్టీఆర్ పాత్ర ప్రాణ త్యాగం చేస్తోందని తెలుస్తోంది. ఎన్టీఆర్ పాత్ర మీదే సినిమా కూడా ఎండ్ అవుతుందట.

ADVERTISEMENT
Latest Stories