ఆర్‌ఆర్‌ఆర్ షూట్‌ను తిరిగి ప్రారంభించడానికి రాజమౌళి కొత్త ఆలోచన

Rajamouli RRR movie Shooting ఆర్‌ఆర్‌ఆర్ – కరోనావైరస్ మహమ్మారి కారణంగా రామ్ చరణ్ మరియు ఎన్‌టిఆర్ యొక్క మల్టీస్టారర్ చిత్రం షూటింగ్ నిలిపివేయబడింది. ఈ చిత్ర దర్శకుడు మరియు నిర్మాత కరోనా వైరస్ పాజిటివ్‌గా పరీక్షించబడ్డటంతో సమస్య మరింత క్లిష్టతరంగా మారింది. అయితే, ఇప్పుడు షూట్ తిరిగి ప్రారంభించటానికి సినిమా టీం ఆలోచన చేస్తుంది

“కరోనా కేసులు తగ్గిన ఐరోపాలో అక్షయ్ కుమార్ బెల్బాటమ్ టీం వారి షూట్ ప్రారంభించబోతోంది. కేసులు లేని దేశాలలో ఈ చిత్రంలోని కొన్ని భాగాలను చిత్రీకరించడానికి రాజమౌళి కూడా ఇదే తరహాలో ఆలోచిస్తున్నారు” అని మనకు ఉన్న సమాచారం. తొందరలో రాజమౌళి లొకేషన్స్ చూడటానికి వెళ్తాడట.

ADVERTISEMENT

సంక్రాంతి 2021 కి విడుదల కావాల్సిన సినిమా మరింత వాయిదా పడింది. అల్లూరి సీతా రామరాజు మరియు కొమరం భీమ్ అనే ఇద్దరు లెజెండరీ ఫ్రీడమ్ ఫైటర్స్ ఆధారంగా తీస్తున్న ఒక కల్పిత కథ ఆర్ఆర్ఆర్ . వారి పోరాటాలకు ముందు ఢిల్లీ లో కలిసినప్పుడు వారి మధ్య ఏమి జరుగుతుంది అనేది ఈ చిత్రం.

రామ్ చరణ్ అల్లూరి పాత్రలో, ఎన్టీఆర్ తెలంగాణ వారియర్ పాత్రలో నటించనున్నారు. ఈ మూవీకి పాన్-ఇండియా విడుదల ఉంటుంది. కొత్త విడుదల తేదీ ఎప్పుడు అనేది షూటింగ్ ప్రారంభం అయితే గానీ తెలియదు. వచ్చే ఏడాది జులైలోనే ఉండే అవకాశం ఉంది.

ADVERTISEMENT
Latest Stories