వావ్… స్టార్ హోటల్స్ లో ‘కబాలి’ సినిమా రిలీజ్..!

Kabali, Rajinikanth Kabali, Kabali Star Hotel Release, Kabali Movie 5 Star Hotel Release, Rajinikanth Kabali 5 Star Hotel Release, Kabali 5 Star Hotel Release, Kabali 5 Star Hotel Release, ‘కబాలి’ సినిమా ద్వారా సూపర్ స్టార్ రజనీకాంత్ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఓ పక్కన శృతిమించిన పబ్లిసిటీ పెనుప్రమాదానికి దారి తీస్తుందన్న హెచ్చరికలు వ్యక్తమవుతుండగా… మరో పక్కన వద్దనుకుంటున్నా ‘కబాలి’ సినిమా ప్రచారం మోతమోగుతోంది. ప్రపంచం మొత్తాన్ని ఊపేస్తున్న ‘కబాలి’ ఫీవర్ ఈ వారంలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.

ADVERTISEMENT

ఇప్పటికే తమిళనాడు వ్యాప్తంగా ఆన్ లైన్లో అందుబాటులో ఉంచిన టికెట్లన్నీ కొద్ది గంటల్లోనే హాట్ కేక్ ల్లాగా అమ్ముడైపోయాయి. అయితే… తాజాగా చిత్ర నిర్మాతలు తీసుకున్న ఓ నిర్ణయం ఇండియన్ సినీ హిస్టరీలో ‘కబాలి’ సరికొత్త అధ్యాయం లిఖించనుంది. సూపర్ స్టార్ ‘కబాలి’ సినిమాను స్టార్ హోటళ్లలో విడుదల చేసేందుకు లేటెస్ట్ గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్టార్ హోటళ్లలోని కాన్ఫరెన్స్ హాల్స్ ను థియేటర్లుగా మారుస్తున్నారు.

కనీసం 300 మంది చూసేలా భారీ తెరలను, సౌండ్ సిస్టమ్స్ ను ఏర్పాటు చేసుకుని రోజుకు నాలుగు ఆటలు ప్రదర్శించేందుకు శరవేగంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్టు లహరి మ్యూజిక్ డైరెక్టర్ ఆనంద్ అధికారికంగా తెలిపారు. బెంగళూరులోని విటల్ మాల్యా రోడ్డులోని జేడబ్ల్యూ మారియట్, యహలంక లోని రాయల్ ఆర్చిడ్, లలిత్ అశోక్, ఎలక్ట్రానిక్ సిటీలోని క్రౌన్ ప్లాజా స్టార్ హోటళ్లలో శుక్ర, శని, ఆదివారాల్లో ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. ఇది కార్యరూపం దాలిస్తే స్టార్ హోటళ్లలో విడుదలైన తొలి చిత్రంగా ‘కబాలి’ చరిత్రలో నిలిచిపోనుంది.

ADVERTISEMENT
Latest Stories