సూపర్ స్టార్ ‘లుంగీ’ మడతేసాడుగా!

Rajinikanth lungi in kaalaస్టైల్ స్టైల్ రా… నీది సూపర్ స్టైల్ రా… అంటూ సూపర్ స్టార్ రజనీకాంత్ స్టైల్ ను ప్రశంసిస్తూ ‘భాషా’ సినిమాలో హీరోయిన్ నగ్మా పాట పాడుతూ ఉంటుంది. ఈ పాట ఒక్క రజనీకి తప్ప మరో హీరోకు సూట్ కాదనే విధంగా… తన స్టైల్స్ తో ప్రేక్షకులను మెప్పిస్తుంటారు. నిజానికి రజనీకి క్రేజ్ తీసుకువచ్చిందే ఈ స్టైల్స్ వలన. ఇతర కధానాయకుల నుండి రజనీని ఈ స్టైల్స్ వేరు చేసాయి.

సినిమాకొక మేనరిజంతో అభిమానులను కట్టిపడేసే రజనీ, తాజాగా తెరకెక్కుతోన్న “కాలా” సినిమాలో కూడా ఓ స్టైల్ ను అనుసరిస్తున్నట్లుగా కనపడుతోంది. ఈ సినిమా ఆద్యంతం రజనీ లుంగీలో దర్శనమివ్వనున్నారని, ఇటీవల విడుదలైన వర్కింగ్ స్టిల్స్ చెప్పకనే చెప్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఓ ఫోటో తాజాగా కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ADVERTISEMENT

లుంగీ పైకి మడతేసి చేత్తో పట్టుకున్న రజనీ స్టిల్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా ఈ స్టిల్స్ తో “భాషా” సినిమా నాటి రోజులు గుర్తుకు వస్తున్నాయి. రజనీ కెరీర్ లోనే కాదు, దక్షిణాది చిత్ర సీమలోనే “భాషా” సినిమా ఒక సెన్సేషన్. అలాంటి సినిమాను గుర్తుకు తెస్తున్న “కాలా” ఏ రేంజ్ లో ఉంటుందో గానీ, వర్కింగ్ స్టిల్స్ తో అయితే అభిమానులను చంపేస్తున్నారు ‘సూపర్ స్టార్.’

ADVERTISEMENT
Latest Stories