ఇక్కడ ఒకే..అక్కడ ఇదే జరిగితే..!

Rajinikanth -Petta Release only 2 theatresరజనీకాంత్ కెరీర్ లో ఎప్పుడూ ఊహించుకుని ఉండరు. తన స్టార్-డం పీక్స్ లో ఉన్న ఈ టైం లో కూడా తన సినిమాలకు థియేటర్స్ దొరకవు అని. అయితే రేపు రిలీజ్ కాబోతున్న పేట సినిమాకి హైదరాబాద్ లో థియేటర్స్ దొరక్కపోవడం, మొదటి రోజును మినహాయిస్తే రెండో రోజు కేవలం హైదరాబాద్ లో రెండే థియేటర్స్ ఉండడం చాల బాధాకరమైన విషయం అనే చెప్పాలి.

ఇక్కడ మన వాళ్ళు థియేటర్స్ మాఫియా అంటూ వాళ్లలో వాళ్ళే కొట్టుకుంటున్నారు కానీ, రేపు మన హీరోలకు అదే గడ్డు పరిస్థితి తమిళ నాట ఎదురైతే ఏం చేస్తారు? పైగా ఇప్పుడిప్పుడే పక్క రాష్ట్రాల్లో మన హీరోలు తమ మార్కెట్ ను విస్తరించుకునే ప్రయత్నంలో ఉండగా ఇలాంటి సమస్యల వల్ల మన హీరోలు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందేమో అని భయపడుతున్నాయి టాలీవుడ్ వర్గాలు. అయితే ఇదే పెరిగి పెద్దదయ్యి రెండు రాష్ట్రాల మధ్య వైరంగా మారితే చాలా ఇబ్బందులు పడాలి.

ADVERTISEMENT

ఇక ఇప్పటికైతే ఈ సినిమా విషయంలో గొడవలు మనలో మనకే అని తమిళులు సరిపెట్టుకుంటున్నారు..వారు కాస్త పర్సనల్ గా తీసుకుంటే మాత్రం మనకు తిప్పట్లు తప్పవు.

ADVERTISEMENT
Latest Stories