అతి త్వరలో… ‘సూపర్ స్టార్’ జెండా… అజెండా…!

Rajinikanth-political-flag!దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆలిండియా ‘సూపర్ స్టార్’ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై మళ్లీ వార్తలు ఊపందుకున్నాయి. మరో రెండు వారాల్లో ఈ ‘తలైవా’ తన రాజకీయ పార్టీని ప్రకటించనున్నారని, అప్పుడే జెండా, అజెండాను కూడా ప్రకటిస్తారని గాంధేయ మక్కల్ ఇయక్కం అధ్యక్షుడు తమిళరువి మణియన్ పేర్కొన్నారు. ఇటీవల తాను రజనీకాంత్‌ ను రెండు సార్లు కలుసుకున్నటు చెప్పిన ఆయన, మరో రెండు వారాల్లో రజనీ ప్రజల మధ్యకు రానున్నట్టు తెలిపారు.

ADVERTISEMENT

తనకు సినీ జీవితాన్ని ప్రసాదించిన ప్రజలకు ఏదైనా చేయాలనే గట్టి పట్టుదలతో రజనీ ఉన్నారని, ప్రజలకు మేలు చేయాలంటే రాజకీయాల్లోకి రావాలని, కాబట్టి తప్పకుండా వస్తానని చెప్పినట్టు వివరించారు. మరో రెండు వారాల్లో రజనీ పార్టీని ప్రకటిస్తారని స్పష్టం చేసారు. ఇటీవల ‘కాలా’ చిత్రం షూటింగ్‌లో బిజీ అయిపోయిన రజనీ, రాజకీయాలపై ఇప్పటికే పలువురితో చర్చించినట్టు తెలుస్తోంది. అభిమానులతో రెండో విడత సమావేశం అనంతరం భారీ బహిరంగ సభలో తన పార్టీని ప్రకటించనున్నట్టు సమాచారం.

ADVERTISEMENT
Latest Stories