ఆ ఒక్క విషయంలో ఎన్టీఆర్ టీమ్ తేలిపోయింది!

Pic Talk: Where Is Sridevi?విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవితాధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్’. క్రిష్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్‌ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్నారు. ఈ చిత్రంలో అలనాటి తార శ్రీదేవి పాత్రలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను ఎంపికచేసుకున్నారు. ఆమె చిత్రీకరణ కూడా మొదలు పెట్టారు.

ADVERTISEMENT

[m9ad]

కాగా..ఈ సినిమాలో శ్రీదేవిగా కన్పించబోతున్న రకుల్‌ ఫస్ట్‌లుక్‌ను ఆమె పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఈరోజు విడుదల చేసింది. తెల్లటి బొట్టు, చీర కట్టులో రకుల్‌ అందంగానే కనిపించినా ఏ మూలనా ఆమె శ్రీదేవి లా అనిపించలేదు. ఆ తరువాత విడుదల చేసిన ఆకు చాటు పిందె తడిసె పాటలోని స్టిల్ లో కూడా శ్రీదేవిగా రకుల్ తేలిపోయిందనే చెప్పుకోవాలి.

ఎన్టీఆర్‌ – శ్రీదేవిలది హిట్‌ కాంబినేషన్‌. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలన్నీ విజయవంతం అయ్యాయి. అలాంటి చిత్రాల్లో ‘వేటగాడు’ ఒకటి. ఈ చిత్రంలోని ‘ఆకు చాటు పిందె తడిసె’ పాట అప్పట్లో మాస్‌ని ఉర్రూతలూగించింది. ఆ పాటతో పాటుగా వారి కాంబినేషన్‌లో వచ్చిన మరి కొన్ని హిట్‌ పాటల్ని ఈ బయోపిక్‌లో చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ADVERTISEMENT
Latest Stories