అతిలోకసుందరిగా రకుల్… రేపే దర్శనం

Rakul Preet Singh - Sridevi Look - NTR -Biopicఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా చిత్రీకరిస్తున్న ఎన్టీఆర్ షూటింగు శరవేగంగా జరుగుతుంది. రెండు భాగాలుగా విడుదల అవుతున్న ఈ చిత్రం మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు లో రకుల్ ప్రీత్ సింగ్ స్వర్గీయ శ్రీదేవిగా నటిస్తుంది. ఈ చిత్రం ఈరోజు రకుల్ ప్రీత్ సింగ్ షూటింగు ప్రారంభించింది.

ADVERTISEMENT

[m9ad]

తొలిరోజే వేటగాడు సినిమాలోని ‘ఆకు చాటు పిందె’ తడిచే పాట చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో రకుల్ లుక్ రేపు ఆమె పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయ్యనున్నారు. ఎన్టీఆర్‌ – శ్రీదేవి కలయికలో వచ్చిన మరి కొన్ని హిట్‌ గీతాల్ని ఈ బయోపిక్‌లో గుర్తు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరి రకుల్ శ్రీదేవిగా ఎలా కనిపించబోతుందో చూడాలి. ఎన్టీఆర్ కథానాయకుడు జనవరి 9న సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతుంది. రెండో భాగం ఎన్టీఆర్ మహానాయకుడు జనవరి 24న రిపబ్లిక్ డే సందర్భంగా వస్తుంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రంకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories