ఇదే ఫస్ట్ పోస్టర్… అదిరింది..!

Rakul Preet singh with mahesh babu in spyderప్రిన్స్ మహేష్ బాబు అభిమానులు హంగామా చేయడానికి సరిగ్గా నెల రోజుల సమయం ఉంది. బహుశా వచ్చే నెల ఈ పాటికి “స్పైడర్” ఫలితం ఏమిటో కూడా ప్రేక్షకులకు తెలిసిపోతుంది. ఈ సమయాన చిత్ర నిర్మాణ సంస్థ ఓ అదిరిపోయే పోస్టర్ ను విడుదల చేసింది. ఇప్పటివరకు మహేష్ సింగల్ స్టిల్స్ ను మాత్రమే విడుదల చేసిన ప్రొడక్షన్ యూనిట్, మొదటిసారిగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ – మహేష్ బాబులు కలిసి ఉన్న స్టిల్ ను రిలీజ్ చేసింది.

ADVERTISEMENT

దర్శకుడు మురుగదాస్ చూపించబోతున్న గ్రాండ్ లుక్ ఏమిటో ఈ పోస్టర్ ద్వారా చెప్పకనే చెప్పాడు. మహేష్ – రకుల్ జంట ఎలా ఉంటుందో అన్న సందేహం కలిగిన వారికి బహుశా ఈ పోస్టర్ సమాధానం చెప్తుందేమో! చూడముచ్చటగా ఉన్న ఈ జోడిలో హీరోయిన్ రకుల్ కంటే ప్రిన్స్ మహేష్ బాబు ఛార్మింగే వీక్షకులను అమితంగా ఆకట్టుకుంటుందని చెప్పడంలో సందేహం లేదు. ప్రస్తుతం వీరిద్దరూ రుమేనియాలో ఓ పాట పాడుకుంటుండగా, అదే సమయంలో వీరిద్దరి స్టిల్ ను రిలీజ్ చేసారు.

ADVERTISEMENT
Latest Stories