‘ఎంటర్టైన్మెంట్’ పేరుతో తెలుగు టెలివిజన్ చానల్స్ రకరకాల కార్యక్రమాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే పనిలో నిమగ్నమవుతున్నాయి. అందులో భాగంగానే మంచు లక్ష్మి నిర్వహిస్తున్న “మేము సైతం” కార్యక్రమానికి సరికొత్త ఆలోచనలతో ప్రస్తుత తారామణులను బుల్లితెర బాట పట్టిస్తున్నారు.
ఇందులో మొదట నిలిచింది టాలీవుడ్ తాజా సెన్సేషన్ రకుల్ ప్రీత్ సింగ్. నిత్యం సోషల్ మీడియాలో సందడి చేసే రకుల్, హైదరాబాద్‌లోని కెపీహెచ్‌బీలో విజిటేబుల్స్ అమ్ముతున్నానంటూ చేసిన ట్వీట్… అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. సమాజాన్ని మార్చే ఓ ప్రోగ్రాం ఇది… రండి తన దగ్గర నుంచి కూరగాయలు కొనుక్కోండి అంటూ అభిమానులకు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నించింది.
సెలబ్రిటీలతో రకరకాల కార్యక్రమాలు నిర్వహించి ఆకట్టుకోవడం ఈ కాన్సెప్ట్ ఉద్దేశం. దీనికి గానూ రకుల్ కూరగాయలను అమ్మడానికి నిర్ణయించుకుంది. మొత్తానికి రకుల్ ఐడియా బాగానే వర్కౌట్ అయ్యింది అంటున్నారు నెటిజన్లు.





