హైదరాబాద్ లో ‘అక్కినేని’ వర్సెస్ ‘మెగా’

ram-charan-akhil dance-performnce in iifa functionహైదరాబాద్‌ గచ్చిబౌలి స్టేడియంలో తొలిసారిగా ఐఫా ఉత్సవాలు ఈ నెల 24, 25 తేదీల్లో చాలా గ్రాండ్‌గా జరుగనున్నాయి. ‘ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అకాడమీ అవార్డుల’ వేడుకలు ఇంతకు ముందు వరకు కేవలం బాలీవుడ్‌కే పరిమితమయ్యేది. అయితే మొట్టమొదటి సారిగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ఫిలిం ఇండస్ట్రీస్ వారికి ఇందులో అవార్డులు ఇవ్వబోతున్నారు. దీంతో ఈ ఫంక్షన్ చాలా ఆసక్తిగా మారిపోయింది. అదీ తొలిసారి హైదరాబాద్‌లో జరుగబోతుండటంతో టాలీవుడ్ స్టార్స్ హంగామా పెరిగింది.

ADVERTISEMENT

ఈ వేడుకలో రాంచరణ్, అఖిల్ లైవ్ డ్యాన్స్ పెర్ఫామెన్స్ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రాక్టీస్‌లు చరణ్, అఖిల్ ప్రారంభించారు. ఇటీవల ‘అఖిల్’ చిత్రం ద్వారా డ్యాన్స్ లలో తన సత్తా ఏంటో చాటిన అక్కినేని వారసుడు స్టెప్పులు హైలైట్ గా నిలుస్తాయో లేక డ్యాన్స్ లకు కేరాఫ్ అడ్రస్ అయిన మెగా వారసుడు నృత్యాలు ఆదరగొడతాయో అని అభిమానులు చర్చించుకుంటున్నారు. వీరితో పాటు టాప్ ఇండియన్ ఫిల్స్ స్టార్స్ అంతా ఐఫా వేడుకలో యమా జోరు ప్రదర్శించనున్నారు. అసలు ఈ ఉత్సవం 2015 డిసెంబర్‌లోనే నిర్వహించాలని ప్లాన్ చేశారు. కానీ, చెన్నైలోని వరదల కారణంగా వాయిదా వేశారు.

ADVERTISEMENT
Latest Stories