బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా పేరు “స్టేట్ రౌడీ”గా గత కొన్ని రోజుల నుండి హల్చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. దీనిని ప్రొడక్షన్ సంస్థ డివివి దానయ్య ఖండించకపోవడంతో, ఈ టైటిల్ ను మెగా అభిమానులు ఫిక్స్ అయిపోయారు. అయితే ఫైనల్ గా వచ్చే టైటిల్ తెలియాలంటే ఇంకొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
[m9ad]
విశేషం ఏమిటంటే… ఈ సినిమా టైటిలే కాదు, ఇందులో రామ్ చరణ్ చెప్పే డైలాగ్స్ కూడా నెట్టింట సందడి చేస్తున్నాయి. విలన్ రామ్ చరణ్ తో “ఏరా 300 మందిని చంపావా నువ్వు?” అంటే, దానికి రామ్ చరణ్ “దారి తెలియక 100 మందిని, దారి కోసం 100 మందిని, దారి తెలిసాక 100 మందిని చంపేసా” అని తనదైన స్టైల్ లో చెప్పినట్లుగా ఈ డైలాగ్స్ చక్కర్లు కొడుతున్నాయి.
ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా, ఈ డైలాగ్స్ బోయపాటి మార్క్ లో ఉండడంతో, మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. హైవోల్టేజ్ మాస్ మెగా ఎంటర్టైనర్ గా ఈ సినిమా సిద్ధమవుతున్న నేపధ్యంలో… ఈ లీకేజ్ డైలాగ్ లు అభిమానుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతోంది. వచ్చే సంక్రాంతికి రికార్డులను బ్రేక్ చేసేందుకు ఈ ‘మెగా మీటర్’ రెడీ అవుతోంది.



