ఈ సారి రామ్ చరణ్ ముఖ్య అతిధి!

allu arjun - ram charan-శ్రీరెడ్డి – వర్మల పుణ్యమా అంటూ మెగా ఫ్యామిలీ అంతా ఒక్క తాటిపైకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటివరకు అభిమానుల్లో నెలకొన్న కొన్ని సందేహాలకు ఈ ఉదంతం నివృత్తినిచ్చినట్లయ్యింది. ఓ పక్కన ఇలా రచ్చ జరుగుతున్న సమయంలోనే… ‘రంగస్థలం’ విజయోత్సవ వేడుకకు పవన్ కళ్యాణ్ గెస్ట్ గా హాజరు కావడం మెగా ఫ్యాన్స్ ను ఖుషిలో ముంచెత్తింది. ఇప్పుడు ‘గెస్ట్’ పాత్రను పోషించడం రామ్ చరణ్ వంతు వచ్చింది.

ADVERTISEMENT

అవును… అల్లు అర్జున్ లేటెస్ట్ సెన్సేషన్ “నా పేరు సూర్య” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గచ్చిభౌలి స్టేడియంలో ఈ నెల 29వ తేదీన గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. ఈ వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిధిగా విచ్చేస్తున్నారు. ఆడియో వేడుకలో రామ్ చరణ్ ను ‘తమ్ముడు’ అని సంభోదించిన అల్లు అర్జున్, ఈ ఈవెంట్ లో ఎలా పిలుస్తారో చూడాలి? అలాగే బన్నీని కూడా చెర్రీ ఎలా సంభోదిస్తారోనని మెగా ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories