మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకధీరు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ లో బిజీబిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వచ్చే ఏడాది జనవరి 8న సంక్రాంతి సందర్భంగా విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న కొత్త చిత్రం లో చరణ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమా కోసం 40రోజుల డేట్స్ కూడా ఇచ్చాడు చరణ్. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ కోసం చిత్రయూనిట్ రాజమండ్రి వెళ్లనున్నారని తెలుస్తుంది. అక్కడ రామ్ చరణ్ పై కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారట.
ఈ చిత్రంలో చిరంజీవి చిన్నప్పటి పాత్రలో రామ్ చరణ్ కనిపిస్తారట. ఒకవేళ అదే గనుక నిజమైతే సినిమాలో చిరంజీవి…. రామ్ చరణ్ కాంబినేషన్ సీన్లు ఉండవు. ఇదే గనుక నిజమైతే ఇది మెగా అభిమానులకు నిరాశకలిగించే వార్తే అని చెప్పుకోవాలి. ఇక ఈ సినిమాకు ‘ఆచార్య ‘ అనే టైటిల్ ను అనుకుంటున్నారు.
మరోవైపు మొదట్లో ఈ సినిమాని ఆగస్టు 14న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చెయ్యాలని ప్లాన్ చేశారు నిర్మాతలు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఏకంగా వచ్చే ఏడాది వేసవి వరకు వాయిదా పడిందని వార్తలు వస్తున్నాయి. త్రిష ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించబోతుంది.





