బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న సినిమా షూటింగ్ ఎలా సాగుతుందో అని చెప్పడానికి నిదర్శనంగా ఈ ఫోటోలను పేర్కొనవచ్చు. ఆరోగ్యకరమైన భోజనాన్ని బాయ్స్ సిద్ధం చేస్తున్నారంటూ సదరు ఫోటోలను చెర్రీ సతీమణి ఉపాసన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసింది.
వంట చేయడం అంటే తనకు ఎంత ఇష్టమో గతంలో ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ తెలిపారు. ఇప్పుడు ఈ ఫోటోలు వాటిని రుజువు చేసే విధంగా ఉన్నాయి. హుషారుగా వంట చేస్తోన్న చెర్రీ పిక్స్ మెగా అభిమానులకు సందడిగా మారాయి. వంట వచ్చిన భర్తను చూసి మురిసిపోవడం ఉపాసన వంతు!
ADVERTISEMENT
[m9adh]
ADVERTISEMENT



