పెద్ది…’మెగా’ ఆకలి తీరుస్తుందా.?

ram-charan-peddi-first-shot-glimpse

RRR మూవీ తో గ్లోబల్ స్టార్ గా ఇమేజ్ దక్కించుకున్న రామ్ చరణ్ తన తదుపరి సినిమాల ఎంపిక విషయంలో నిర్లక్ష్యం వహించారా అంటే వాటి ఫలితాలు చూస్తే అవును అనే సమాధానమే వినిపిస్తుంది.

ADVERTISEMENT

తండ్రి మెగా స్టార్ చిరు ఆచార్య మూవీ లో అతిధి పాత్రలో నటించిన చెర్రీ భారీ డిజాస్టర్ ను ఎదుర్కొన్నారు. అయితే ఇదంతా రాజమౌళి సెంటిమెంట్ అంటూ సరిపెట్టుకున్న మెగా అభిమానులు శంకర్ గేమ్ ఛేంజర్ పై ఆశలు పెట్టుకున్నారు.

అయితే చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ, అప్ డేట్స్ నుంచి విడుదల వరకు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించిందంటే అతి సయోక్తి కాదేమో. చివరకు అన్ని డేట్స్ మార్చుకుంటూ ఈ సంక్రాంతికి GC థియేటర్లలోకి వచ్చినప్పటికీ సాధారణ ప్రేక్షకుడినే కాదు కనీసం మెగా అభిమానులను సైతం ఈ మూవీ ఆకట్టుకోలేకపోయింది.

అటు ఆచార్య డిజాస్టర్ తరువాత మెగా స్టార్ చిరు వాల్తేరు వీరయ్య తప్ప గాడ్ ఫాదర్, బోళా శంకర్ బాక్స్ ఆఫీస్ ముందు నిలబడలేకపోయాయి. ఇక మరో మెగా హీరో అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం రాజకీయాలకే పెద్ద పీఠం వేయడంతో పవన్ నుంచి బ్రో తరువాత ఎటువంటి మూవీ విడుదల కాలేదు.

అటు వరుణ తేజ్ కూడా ప్లాప్స్ తోనే కెరీర్ ను నెట్టుకొస్తున్నారు. ఇలా మెగా హీరోలందరూ ఒక మంచి విజయం కోసం, బాక్స్ ఆఫీస్ రికార్డుల కోసం ఆకలి గా ఎదురుచూస్తున్న ఇటువంటి కీలక సమయంలో రామ్ చరణ్ పెద్ది గ్లిమ్స్ అందరి ఆశలకు ఉపిరిపోసింది. ఈ గ్లిమ్స్ లో చెర్రీ కొట్టిన షాట్ అవుట్ ఆఫ్ ది స్టేడియం అంటున్నారు మెగా అభిమానులు.

అలాగే విడుదలైన ఫస్ట్ షాట్ లో వచ్చిన డైలాగ్స్, బీజీఎమ్, విజువల్స్, చెర్రీ లుక్స్ అన్ని కూడా ఎక్స్ట్రార్డినరీ అంటున్నారు సినీ విశ్లేషకులు. రంగస్థలం తరహాలో ఒక ఊర మాస్ లుక్ లో కనిపించిన చెర్రీ తన లుక్స్ తోనే ఇండస్ట్రీ అటెన్షన్ ను తన వైపు తిప్పుకున్నారు.

ఉప్పెన వంటి ఒక్క సినిమా దర్శకత్వ అనుభవంతో బుచ్చిబాబు చరణ్ వంటి గ్లోబల్ స్టార్ ఇమేజ్ ఉన్న నటుడిని హ్యాండిల్ చెయ్యగలరా అనుకున్న ప్రతి ఒక్కరి అనుమానాలను ఒకే ఒక్క షాట్ తో పటాపంచలు చేసి తన గురువుగారైన సుక్కు పేరు నిలబెట్టారు బుచ్చిబాబు.

ఇప్పుడు పెద్ది కొట్టిన గ్లిమ్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. చెర్రీ నుంచి ఇది కదా మేము కోరుకుంటుంది అంటూ హిట్ కోసం ఆకలి మీదున్న మెగా అభిమానులు పెద్ది అప్ డేట్స్ కోసం వెయిటింగ్ లో ఉన్నారు.

ఇక ఈ సినిమాలో చరణ్ సరసన జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటించనున్నారు. అన్ని అనుకున్నట్టు జరిగితే మార్చ్ 27 2026 చరణ్ పుట్టిన రోజు సందర్భంగా పెద్ది థియేటర్లలో ప్రత్యక్షం కానుంది అంటూ విడుదల తేదీని ప్రకటించారు మూవీ మేకర్స్.

ADVERTISEMENT
Latest Stories