నాన్న కోసం… ఇంతకు ముందు జరగనట్టుగా… రామ్ చరణ్ ప్లాన్

Ram Charan Plans big event for Sye Raa Narasimha Reddyమెగాస్టార్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘సైరా’ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవలే చిత్రం టీజర్ ముంబైలో విడుదల చేసి సినిమా పబ్లిసిటీ మొదలుపెట్టారు. టీజర్ బావుండడంతో అన్ని భాషలలోనూ మంచి బజ్ వచ్చింది. ఇది ఇలా ఉండగా ఈ సినిమా కోసం ఒక గ్రాండ్ ఈవెంట్ చెయ్యాలని నిర్మాత రామ్ చరణ్ భావిస్తున్నాడు. హైదరాబాద్ లో గానీ, కర్నూల్ లో గానీ, తిరుపతిలోగానీ, విజయవాడలోగానీ ఇది వచ్చే నెలలో జరగబోతుంది.

ADVERTISEMENT

ఈ ఈవెంట్ కు దేశంలోనే అతిపెద్ద సూపర్ స్టార్లు – అమితాబ్ బచ్చన్, రజినికాంత్లను తీసుకురావాలని రామ్ చరణ్ భావిస్తున్నాడు. అదే జరిగితే జాతీయ స్థాయిలో ఈ ఈవెంట్ కు పబ్లిసిటీ వచ్చి సినిమాకు కావాల్సిన ప్రమోషన్ వచ్చేసినట్టే. ఇప్పటికే చిత్రబృందం దీని అనుమతుల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు సమాచారం. టాలీవుడ్ సినీ చరిత్రలో ఇంతకు ముందెన్నడూ జరగనట్టుగా దీనిని చెయ్యాలని రామ్ చరణ్ అభిలాషగా ఉందట.

మరోవైపు సౌతిండియా లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా నటించింది. మరోవైపు తమన్నా కూడా ఈ సినిమాలో నర్తకి పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళ,కన్నడ భాషల్లో ఏక కాలంలో రిలీజ్ చేయనున్నారు. ఆయా భాషల్లో క్రేజ్ తీసుకువచ్చేందకు ఇప్పటికే ఆయా భాషలకు చెందిన నటీనటులతో సినిమాకు వాయిస్ – ఓవర్ ఇప్పించారంట. తెలుగులో పవన్ కళ్యాణ్, తమిళ టీజర్‌కు రజినీకాంత్, మలయాళంలో మోహన్ లాల్, కన్నడలో యశ్, హిందీలో అమితాబ్ బచ్చన్ ‌తో ఈ సినిమా టీజర్‌కు వాయిస్ ఓవర్ చెప్పించనున్నట్టు సమాచారం.

ADVERTISEMENT
Latest Stories