సైరా’ ఫస్ట్ లుక్ చూస్తూ చెర్రీ ఆనందం?

ram charan watching Sye Raa Narasimha Reddy first lookబోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న సినిమా ఫస్ట్ లుక్ బయటకు రావడానికి మరికొంత సమయం ఉండడంతో, అభిమానులను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు చెర్రీ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అలరిస్తోంది ఉపాసన. ఆ క్రమంలోనే సండే స్పెషల్ గా ఎయిర్ పోర్ట్ లో కూర్చుని ఉన్న రామ్ చరణ్ పిక్ ను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

ADVERTISEMENT

తన ఫోన్ వంక చూసుకుంటూ నవ్వుతున్న రామ్ చరణ్, చాలా స్టైలిష్ గా కనపడుతున్నాడు. బ్లాక్ జర్కిన్… గడ్డం… గాగుల్స్ తో ఆదివారం నాడు మెగా ఫ్యాన్స్ కు కన్నులవిందు చేస్తున్నాడు. ఇంతకీ ఫోన్ లో ఏముంది అంటారా…? బహుశా తాను నిర్మిస్తోన్న “సైరా” ఫస్ట్ లుక్ పోస్టర్ ను చూస్తూ ఆనందంలో మెగా పవర్ స్టార్ ఉన్నారేమో..! అంటూ అభిమానులు సరదాగా ఈ ఫోటోను చూస్తూ చర్చించుకుంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories