పిక్ టాక్ : ఏంటీ ఈ జనాలు! హీరోకైనా ఉంటుందా?

Ram Gopal Varma in vijayawadaసంచలన దర్శకులు వర్మ విజయవాడలో అడుగుపెట్టి దాదాపుగా 24 గంటలు కావస్తోంది. ఏ పని మీదైతే బెజవాడ వచ్చారో సైలెంట్ గా ఆ పని కానిస్తున్నారు వర్మ. ఉదయం నుండి వరుసగా కర్నాటి రామ్మోహనరావు, దేవినేని నెహ్రూలతో భేటీలవుతూ తన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటున్నారు. అయితే వర్మ విజయవాడ విచ్చేసిన సందర్భంగా వర్మకు ఘనస్వాగతం పలికిన జనసందోహం పట్ల అందరూ ఆశ్చర్యచకితులవుతున్నారు.

నిజంగా ఒక పెద్ద హీరో విచ్చేసిన సమయంలో కూడా ఇంత భారీగా అభిమానులు ఘనస్వాగతం పలుకుతారో లేదో గానీ, వర్మ రాక కోసం చేసిన ఏర్పాట్లు అవాక్కయ్యేలా ఉన్నాయి. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. అలాంటి సర్క్యులేట్ అవుతున్న ఫోటోలలో… రామవరప్పాడు సెంటర్ లో కారు ఆగిన సమయంలో వర్మ కారుకు అభిమానులు పూలభిషేకం చేస్తున్న ఈ బొమ్మ బాగా సందడి చేస్తోంది.

ADVERTISEMENT

వర్మకు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ లేదన్న విషయం తెలిసిందే అయినా… వంగవీటి వర్గీయులో, దేవినేని అనుచరులో దీని వెనుకున్నారని పొలిటికల్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సందర్భంగా వంగవీటి – దేవినేని కుటుంబాలకు విజయవాడ రాజకీయాలలో ఉన్న ప్రాధాన్యత ఏమిటో మరోసారి తెలిసి వచ్చినట్లయింది.

ADVERTISEMENT
Latest Stories