‘వంగవీటి’ రహస్యాలు వెల్లడిస్తున్న ‘దేవినేని నెహ్రూ!’

ram gopal varma meets devineni nehru for vangaveeti movie‘వంగవీటి’ చిత్రం కోసం విజయవాడలో విచ్చేసిన రాంగోపాల్ వర్మ కాంగ్రెస్ సీనియర్ నేత, బెజవాడ ‘రక్తచరిత్ర’కు సజీవ సాక్ష్యమైన దేవినేని నెహ్రూతో భేటీ అయ్యారు. వంగవీటి – దేవినేని కుటుంబాల మధ్య ఉన్న శతృత్వం, ఆనాటి ఘర్షణలు వంటి పలు విషయాలపై లోతుగా తెలుసుకునేందుకు వారిద్దరి మధ్య జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో తన స్నేహితుడు లగడపాటి రాజగోపాల్ తో భేటీ కానున్నట్లు టాక్.

ADVERTISEMENT

దీనికి ముందు ప్రముఖ న్యాయవాది కర్నాటి రామ్మోహన్ రావును కూడా వర్మ కలిసి చర్చలు జరిపారు. వంగవీటి – దేవినేని కుటుంబంతో సంబంధం ఉన్న పలు కేసులకు సంబంధించి ఆయన నుంచి వర్మ సమాచారాన్ని సేకరించినట్లుగా సమాచారం. అయితే, వర్మతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన కర్నాటి, అసలు విజయవాడలో రౌడీయిజమే లేదని చెప్పడం కొసమెరుపు!

ఇదిలా ఉంటే… దివంగత వంగవీటి మోహన రంగ జీవిత ఆధారంగా ‘వంగవీటి’ చిత్రాన్ని తెరకెక్కించడంపై సీపీఎం విరుచుకుపడింది. సీపీఎం నేత దోనెపూడి శంకర్ మాట్లాడుతూ… “వంగవీటి” చిత్రనిర్మాణంపై నిషేధం విధించాలని, ప్రశాంతంగా ఉన్న బెజవాడలో తన చిత్రంతో అలజడి రేపేందుకు యత్నిస్తున్న వర్మను అరెస్ట్ చేయాలని, ఈ చిత్రంలో తమ పార్టీ నేత చలసాని వెంకటరత్నంను కత్తిపట్టిన రౌడీగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని” తీవ్రంగా స్పందించారు.

ADVERTISEMENT
Latest Stories