పవన్ పై… వర్మ “ఫిలాసఫీ” వింటే అవాక్కవ్వాల్సిందే..!

Ram Gopal Varma satire on Pawan kalyan and chiranjeeviక్రియేటివ్ దర్శకుడిగా వర్మకున్న పేరు, క్రేజ్ తెలియనిది కాదు. వర్మ మనసుపెట్టి చేయాలే గానీ ఇప్పటికీ సంచలమైన సినిమాలను తీయగల సత్తా వర్మ సొంతమన్న విషయం చాలా మంది అంగీకరించే విషయం. అయితే తన క్రియేటివిటీని సినిమాలపై కాకుండా ట్విట్టర్ రూపంలో ప్రదర్శిస్తున్నారు వర్మ.

ADVERTISEMENT

పవన్ కళ్యాణ్ ను ప్రశంసించే విషయంలో వర్మ తాజాగా చేసిన ట్వీట్ పవన్ అభిమానుల మద్దతు పొందుతోంది. రాజమౌళి + ప్రభాస్ + హాలీవుడ్ లెవెల్ గ్రాఫిక్స్ + 300 రోజుల షూటింగ్ + 150 కోట్లు బడ్జెట్ = 100 రూపాయలు ఒక వైపు అయితే, జస్ట్ పవన్ కళ్యాణ్ ఒక్కడే = 100 రూపాయలు అని ‘బాహుబలి’ సినిమా యూనిట్ అంతా ఒక వైపు… పవన్ ఒక్కడే మరో వైపు… ‘బాహుబలి’ రికార్డులన్నీ పవన్ సాధిస్తాడనే నమ్మకంతో కూడిన ట్వీట్ చేసారు వర్మ.

మరి వర్మ వ్యాఖ్యలు నిజమవుతాయో లేవో తెలియాలంటే ఏప్రిల్ 8వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే. ఒకవేళ విడుదల రోజున టాక్ అనుకూలంగా రాకపోతే ఇప్పుడు ఎలాగైతే ఆకాశానికేత్తేసారో… అప్పుడు విమర్శలతో మండిపడే వ్యక్తులలో కూడా వర్మే ముందు వరుసలో ఉంటారని గమనించాలి.

ADVERTISEMENT
Latest Stories