ఇప్పటివరకు సినీ హీరోలకు మాత్రమే పరిమితమైన ఈ ‘స్టార్’ బిరుదులు తాజాగా రాజకీయ నాయకులకు కూడా వర్తింపచేస్తున్నారు దర్శకులు రాంగోపాల్ వర్మ. దీనికి తెరలేపింది ముద్రగడ పద్మనాభం సృష్టించిన కాపు ఐక్య వేదిక ఉదంతం. దీనిని ప్రస్తావిస్తూ… “సిల్వర్ స్క్రీన్ స్టార్లుగా ఎదిగిన కమ్మ మైండ్ ఉన్న కాపులతో పోల్చుకుంటే… ముద్రగడ పద్మనాభం ఒక్కరే అసలు మెగా పవర్ స్టార్ అని, ఆయన పార్టీ స్థాపిస్తే నేను కాపు కాకపోయినా ఆ పార్టీలో చేరతానని, ‘మెగా పవర్’ ఫెయిల్ అయిన చోట డాల్బీ డిజిటల్ సౌండ్ మాదిరి ముద్రగడ గర్జించారని, స్క్రీన్ మెగా పవర్ స్టార్లు అంతా బూటకపు నటులు మాత్రమేనని” వర్మ ట్విట్టర్ వేదికగా మరోసారి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసుకుని ట్వీట్లు సంధించారు.
ఇదిలా ఉంటే, చెప్పిన విధంగానే విజయవాడలో ల్యాండయ్యాడు వర్మ. ఒక అగ్ర హీరోకు అభిమానులు పలికిన స్వాగతం మాదిరి భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లతో అభిమానులు, కార్యకర్తలు వర్మకు నీరాజనాలు పలికారు. నిజానికి ఈ ఉదంతం చూసి ఒక విధంగా వర్మే షాక్ తిన్నారు. వంగవీటి రత్నకుమారి తనకు అప్పాయింట్మెంట్ ఇవ్వలేదని, రాధాతో కలవాల్సిన అవసరం లేదని, అయితే రంగా అనుచరులను మాత్రం కలుస్తున్నానని, దేవినేని నెహ్రూ అప్పాయింట్మెంట్ ఇచ్చారని, శనివారం నాడు ఉదయం కలుస్తున్నానని చెప్పుకొచ్చారు. గన్నవరం నుండి ఎయిర్ పోర్టుకు నుండి హోటల్ మురళీ ఫార్చూన్ కు చేరుకున్న తర్వాత అర్ధరాత్రి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేసారు.



