ఎన్టీఆర్ ఫ్యాన్స్… ఈయన్ని లైట్ తీసుకోండి..!

Ram-Gopal-Varma -Tweets on NTR First Lookతమ అభిమాన హీరోని ఎవరైనా పొగిడితే ఫ్యాన్స్ కు వచ్చే ఆనందమే వేరు! అయితే కొందరు పొగిడితే మాత్రం ఆనందించడం కంటే కూడా ఆలోచించాల్సి ఉంటుంది. అందులో మొదటి వ్యక్తి రాంగోపాల్ వర్మ. ఈయన సినిమా రిలీజ్ కు ముందు వరకు ఎంత పొగిడితే, రిలీజ్ అయిన తర్వాత అంతగా ఎటకారాలతో ఫ్యాన్స్ కు మానసిక క్షోభను మిగులుస్తారు. పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ విషయం బాగా సుపరిచితం. ఇండియాలోనే పవన్ కళ్యాణ్ అంతటోడు ఎవరూ లేరన్న వర్మ, ఇటీవల ఏకంగా శ్రీరెడ్డితో పోల్చి పవన్ గాలి తీసేసిన వైనం అందరికీ తెలిసిందే.

ADVERTISEMENT

ఇలా పవన్ ఒక్క విషయంలోనే కాదు, వర్మ ఫార్ములానే ఇది. అయితే తాజాగా “అరవింద సమేత వీరరాఘవ” ఫస్ట్ లుక్ పోస్టర్ ను సెక్సీయర్ అంటూ తనదైన శైలిలో అభివర్ణిస్తూ జూనియర్ ఎన్టీఆర్ ను ప్రశంసలతో ముంచెత్తాడు. దీంతో సహజంగానే ఎన్టీఆర్ అభిమానులు వర్మకు అనుకూలంగా పోస్ట్ లు చేస్తున్నారు. ప్రశంసలు కురిపించడం తప్పు కాదు గానీ, వర్మ శైలిని ఫాలో అయ్యే వారికి…. వీటిలో పొగడ్తల కంటే కూడా భవిష్యత్తు విమర్శలు కనపడుతున్నాయి. అందుకే వర్మ విమర్శించినా, ప్రశంసించినా జూనియర్ అభిమానులు లైట్ తీసుకోవడం బెటర్.

ADVERTISEMENT
Latest Stories