బాబును వెతకండి… లక్ష పట్టండి…!

ram gopal varma tweets to find chandrababu naidu look alikeతన “భైరవగీత” కోసం పబ్లిసిటీ రంగంలోకి దిగిన వర్మ, యధావిధిగా తన తదుపరి సినిమాను ప్రకటించి మీడియా వర్గాల దృష్టిని ఆకర్షించాడు. “లక్ష్మీస్ ఎన్టీఆర్” పేరుతో సోషల్ మీడియాలో జరుగుతోన్న ఈ రచ్చలోకి ఓ వీడియో వచ్చి చేరింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలికలు ఉన్న ఓ వ్యక్తి వీడియో పోస్ట్ చేస్తూ… లక్ష రూపాయల ఆఫర్ ను ప్రకటించాడు.

ADVERTISEMENT

[m9ad]

ఓ హోటల్ లో సర్వర్ గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తిలో బాబు పోలికలు ఉండగా… “ఈ మనిషి నా దగ్గరికి పట్టుకుని వచ్చిన వారికి లక్ష రూపాయలను బహుమతి”గా ఇస్తానని తెలిపాడు. ఇది స్వయంగా వర్మ పోస్ట్ చేసిన వీడియోనే కావడంతో, అసలు ఆ వ్యక్తి ఎవరో తెలియకుండా వీడియో వర్మ దగ్గరికి చేరి ఉంటుందా? అన్న సందేహం తలెత్తకమానదు.

ఇదంతా ఈ నెలాఖరున విడుదల కాబోతోన్న “భైరవగీత” పబ్లిసిటీ మాయ అని, ఒక్కసారి ఆ సినిమా రిలీజ్ అయ్యి ఫలితం డిక్లేర్ అయిన తర్వాత మళ్ళీ ప్రేక్షకులను పట్టించుకోరని, ఇలాంటి వర్మ ఎత్తులకు ఇప్పటికే చాలాసార్లు చూసేసామని సినీ జనాలు చెప్పుకుంటున్నారు. దీంతో “వర్మకన్నీ తన సినిమా రిలీజ్ కు ముందే గుర్తొస్తాయి కదా?!” అనుకోవడం ప్రేక్షకుల వంతవుతోంది.

ADVERTISEMENT
Latest Stories