నార్నే బుజం మీద నుండి బాబును కాల్చే ప్రయత్నం.. నిజం ఏది?

Ramamurthy-Naidu!ఇటీవలే వైకాపాలో చేరిన జూనియర్ ఎన్టీఆర్ మామ, నార్నే శ్రీనివాసరావు ఈ ఎన్నికలలో పోటీ చేస్తారని విస్తృతంగా ప్రచారం జరిగినా జగన్ ఆయనకు అవకాశం ఇవ్వలేదు. అయితే ఆయనకు నామినేటెడ్ పదవి ఎర చూపి టీవీ ఇంటర్వ్యూలు ఇప్పించి చంద్రబాబుపై విమర్శలు చేయిస్తున్నారు. ప్రధానంగా ఆయన చంద్రబాబు తన కుటుంబంలో ఎవరినీ రాజకీయంగా ఎదగనివ్వరు అని పలుమార్లు చెప్పడాన్ని బట్టి ఆయనకు చంద్రబాబు తనకు పార్టీలో అవకాశం ఇవ్వలేదు అనే అక్కసు స్పష్టంగా కనిపిస్తుంది.

ఇదే సందర్భంలో చంద్రబాబు నాయుడు తన తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడును టిక్కెట్ ఇవ్వకుండా బాధ పెట్టి ఆయనకు మతి చెడేలా చేశారని, ఆయనను ఒక గదిలో బందీగా చేసి కట్టి పడేశారని, చంద్రబాబుకు వందల కోట్లు ఉన్నా తమ్ముడికి ట్రీట్మెంట్ చేయించలేదని ఆరోపించారు. నారా రామ్మూర్తి నాయుడుకు ఒక మానసిక రుగ్మత ఉన్న మాట వాస్తవమే. దానికి వైద్య శాస్త్రంలో మందు లేదని ఆయన కొడుకు నారా రోహిత్ తరచు ఇంటర్వ్యూలలో చెబుతూ ఉండే వారు.

ADVERTISEMENT

ఒకవేళ చంద్రబాబు కు తమ్ముడి మీద ప్రేమ లేదు అని అనుకున్నా ఆయనకు ఒక కుటుంబం ఉంది వారు ట్రీట్మెంట్ చేయించుకునే వారు ఏమాత్రం అవకాశం ఉన్నా. చంద్రబాబు నాయుడు వల్లే రామ్మూర్తి నాయుడుకు ఈ పరిస్థితి వచ్చిందంటే ఆయన కొడుకు చంద్రబాబు దగ్గరకు చేరడు కదా. మనం తరచూ చంద్రబాబు నారా రోహిత్ సినిమాల ఆడియో ఫంక్షన్లకు హాజరు కావడం చూస్తూనే ఉన్నాం. ఇటీవలే ఒక టీవీ ఇంటర్వ్యూలో నా పెళ్లి విషయం పెద్దనాన్నకే వదిలి పెట్టా అని రోహిత్ అనడం విశేషం.

సాక్షికి నార్నే శ్రీనివాసరావు ఇచ్చిన ఇంటర్వ్యూ చూస్తే ఆయన చంద్రబాబు మీద ఎంతటి అక్కసు పెట్టుకున్నారో ఈజీగా అర్ధం అవుతుంది. ఒక దశలో ఏకంగా ప్రధాని మోడీ రాష్ట్రానికి చెయ్యాల్సినది అంతా చేసేశారు చంద్రబాబే అవినీతి చేశారు అని చెప్పడం విశేషం. ఇక చంద్రబాబు అంటే పీకల దాకా కోపం ఉండే సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని ఆయనకు చంద్రబాబును తిట్టడానికి ఒక్కో అంశం అమాయకంగా అందిస్తూ ఆయన దుమ్మెత్తి పోస్తుంటే పరవశం పొందడం హై లైట్.

ADVERTISEMENT
Latest Stories