హీరోయిన్ గారు… మీరే సెటిల్ చేసుకోండి..!

Rambha - Divorce Court Caseతెలుగు తెరపై అగ్ర నటీమణిగా రాణించిన రంభ ఇంట వ్యవహారం కోర్టు దాకా వెళ్ళడంతో, అది ప్రస్తుతం మీడియా వర్గాల్లో హల్చల్ చేస్తోంది. తన భర్తను – తనను కలపాలని, అలాగే ఆయన నుండి నెలకు 2.50 లక్షలు భరణంగా ఇప్పించాలని రంభ కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో… ఇది మీ కుటుంబ సమస్య కాబట్టి, సామరస్యంగా మాట్లాడి పరిష్కరించుకోవాలని న్యాయమూర్తి సూచించారు.

కెనడాకు చెందిన ఇంద్రకుమార్ ను రంభ 2010లో ప్రేమ వివాహం చేసుకోగా, ఆమెకు ఇద్దరు పిల్లలు పుట్టిన సంగతి తెలిసిందే. ఆపై భర్తతో గొడవపడి చెన్నైకి వచ్చేసిన రంభ, హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇది విచారణకు రాగా, ఓ న్యాయవాదిని నియమించిన కోర్టు, రంభను – ఇంద్రకుమార్ ను ఓ గదిలో ఉంచి మాట్లాడుకుని, వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచించింది. సమస్య పరిష్కారం కాకుంటే అప్పుడు తాము కల్పించుకుంటామని తేల్చింది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories