యంగ్ హీరోకు అమ్మగా శివగామి

Ramya Krishna as Vijay Deverakonda Motherచాలా కాలం వేచి చూశాక ఇస్మార్ట్ శంకర్ తో పెద్ద హిట్ అందుకున్నాడు రామ్. ఇస్మార్ట్ శంకర్ రామ్ కెరీర్ లోనే పెద్ద హిట్ గా నిలిచింది. దాదాపుగా 35 కోట్ల షేర్ రాబట్టింది. దీనితో హప్పెనింగ్ హీరో విజయ్ దేవరకొండని దర్శకత్వం వహించే ఛాన్స్ వచ్చింది పూరికి. దానితో ఫైటర్ అనే సినిమాకు శ్రీకారం చుట్టాడు.

ఆ సినిమా జనవరిలోనే సెట్స్ మీదకు వెళ్తుంది. ఈ సినిమాలో విజయ్ అమ్మ పాత్రలో రమ్యకృష్ణ కనిపించబోతుందట. ఫైటర్ ని తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషలలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. దీనితో హిందీలో పాటు మిగిలిన భాషలలో శివగామిగా పాపులరైన రమ్యకృష్ణ ఉపయోగపడుతుందని పూరి భావిస్తున్నాడు.

ADVERTISEMENT

రమ్యకృష్ణ ప్రస్తుతం పూరి నిర్మాణంలో ఆయన కుమారుడు ఆకాష్ నటిస్తున్న రొమాంటిక్ లో కూడా ఒక కీలక పాత్రలో నటించబోతుంది. ప్రస్తుతం విజయ్ తాన వరల్డ్ ఫేమస్ లవర్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆ చిత్రం చివరి షెడ్యూల్ జరుగుతుంది. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సినిమాతో పాటు తమిళ దర్శకుడు ఆనంద్‌ అన్నామలై దర్శకత్వంలో హీరో సినిమాలో నటిస్తున్నాడు విజయ్. ఆ సినిమా కూడా మొన్న ఆ మధ్య హీరో సినిమాను కూడా ఏవో స్క్రిప్ట్ సమస్యలు అని మధ్యలో ఆపేశాడు. ఆ సినిమా షూటింగ్ మళ్ళీ మొదలు అవుతుందని వార్తలు వచ్చినా అది జరగలేదు.

ADVERTISEMENT
Latest Stories