వర్తమాన బాలీవుడ్ హీరోలలో మోస్ట్ హాండ్సమ్ హీరోగా పేరు తెచ్చుకున్న రణబీర్ కపూర్ వ్యక్తిగత ‘ఎఫైర్ల’ గురించి సినీ జనాలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదేమో. దాదాపుగా అందరి బాలీవుడ్ టాప్ హీరోయిన్లతోనూ ఎఫైర్లు కొనసాగించిన ఈ స్మార్ట్ హీరోకు ఓ పాడుబుద్ధి ఉందండోయ్! ప్రస్తుతం ఈ హీరో చేసిన పనే బాలీవుడ్ నాట ఇదే హాట్ టాపిక్ గా హల్చల్ చేస్తోంది.
రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ జంటగా నటించిన ‘జగ్గా జాసూస్’ సినిమా జూలై 14వ తేదీన విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో… చిత్ర యూనిట్ అంతా ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటూ అభిమానులను ఉత్సాహాపరిచే పనిలో పడింది. అందులో భాగంగానే తాజాగా జరిగిన పబ్లిసిటీ వేడుకలో హీరో రణ్‌బీర్, హీరోయిన్ కత్రీనా కైఫ్ లతో పాటు చిత్ర దర్శకుడు అనురాగ్ బసు కూడా పాల్గొన్నారు.
ఈ నేపథ్యంలో కార్యక్రమం ముగియగానే అందరూ చూస్తుండగా… రణబీర్ కపూర్ ఒక్కసారిగా వెళ్లి దర్శకుడు అనురాగ్ బసుకి లిప్ కిస్ ఇచ్చేసాడు. దీంతో అవాక్కవ్వడం మీడియా వర్గీయుల వంతయ్యింది. అయితే రణబీర్ కు ఇదే తొలిసారి కాకపోవడం మరో విశేషం. దాదాపుగా అయిదేళ్ళ క్రితం అనురాగ్ బసు దర్శకత్వంలో వచ్చిన ‘బర్ఫీ’ సినిమా ప్రచారం కార్యక్రమంలో కూడా ఇలాగే కిస్ ఇచ్చి షాక్ ఇచ్చాడు రణబీర్.



