ఇట్స్ ఆల్ టైం రికార్డ్!

Rarandoi Veduka Chuddham Naga Chaitanya Record Collections ‘బాహుబలి 2’ తర్వాత వారంలో విడుదలైన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద పత్తా లేకుండా పోవడంతో, ఈ సునామీని తట్టుకుని నిలబడే సినిమా ఉంటుందా? అన్న సందేహాలను “కేశవ, రారండోయ్ వేడుక చూద్దాం” సినిమాలు తీర్చాయి. ముఖ్యంగా త్వరలో పెళ్లికొడుకు కాబోతున్న నాగచైతన్య హీరోగా నటించిన సినిమాపై అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్న నేపధ్యంలో… ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో అన్న ఆసక్తి అభిమాన వర్గాలతో పాటు ట్రేడ్ వర్గాల్లో కూడా నెలకొని ఉంది.

అయితే విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న ఈ సినిమా ఇప్పటివరకు 25 కోట్లను పైగా షేర్ వసూలు చేసి, చైతూ కెరీర్ లో ‘ఆల్ టైం రికార్డు’ను నెలకొల్పిందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఏపీ, తెలంగాణాలతో పాటు ఓవర్సీస్ లో కూడా మంచి ఫలితాలనే రాబట్టడం చెప్పుకోదగ్గ విషయం. యుఎస్ మార్కెట్ లో హాఫ్ మిలియన్ మార్క్ ను అందుకున్న ఈ సినిమా విజయం, వ్యక్తిగతంగా చైతూ మాంచి ‘బూస్ట్’ ఇచ్చినట్లే భావించవచ్చు. అక్టోబర్ లో సమంతతో కలిసి పెళ్లిపీటలు ఎక్కబోతున్న చైతూకు, మంచి కాలం రాబోతోందని ఈ సినిమా విజయం చెప్పకనే చెప్పిందా!

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories