‘గీత గోవిందం’ బ్లాక్ బస్టర్ సక్సెస్ తో ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన రష్మికకు, ఇప్పటికే నిశ్చితార్ధం జరిగిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ జంట మధ్య విభేదాలు వచ్చాయి, త్వరలో విడిపోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ దీనిపై హీరోయిన్ రష్మిక తీవ్రంగా స్పందిస్తూ, ఆ పుకార్లను కొట్టిపడేసింది.
కానీ “నిప్పు లేనిదే పొగ రాదన్న” సామెతను రుజువు చేస్తూ తాజాగా ఆ రిలేషన్ కు బ్రేకప్ పడిన వార్త అధికారికం అయ్యింది. ‘ఆ ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో ఈ పెళ్లిని, అయిన నిశ్చితార్ధాన్ని రద్దు చేసుకున్నట్లుగా’ స్వయంగా రష్మిక తల్లి సుమన్ మందన్న స్పష్టం చేసారు. దీంతో ఈ సెలబ్రిటీల ప్రేమకు ఇక్కడితో శుభంకార్డు పడిపోయినట్లయ్యింది.
ADVERTISEMENT
[m9adh]
ADVERTISEMENT



