ఇటీవల కాలంలో లిప్ లాక్ తో పాపులర్ అయిన సినిమాలలో “రథం” కూడా ఒకటి. లిప్ లాక్ లో కూడా వెరైటీ పాటించిన ఈ సినిమా ధియేటిరికల్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. కొత్త జంట గీతానంద్ – చాందిని భాగ్వానని నటించిన ఈ ట్రైలర్ లో గొప్పగా కనపడిన సన్నివేశాలేవీ లేవు, ఒక్క డైలాగ్ తప్ప! ‘మంచివాడు పక్కింట్లో ఉంటే మనోడురా అంటాం, అదే మనింట్లో ఉంటే ఇవన్నీ మనకెందుకురా అంటాం’ అనేదే ఆ డైలాగ్.
[m9ad]
‘లవ్ అండ్ రివేంజ్’ కాన్సెప్ట్ తో రొటీన్ కధగా తెరకెక్కిన ఈ సినిమా మేకింగ్ లో నాణ్యత కూడా కనిపించడం లేదు. కానూరి చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రాజా దారపునేని నిర్మించారు. కొత్త కాన్సెప్ట్ లతో వస్తోన్న చిన్న సినిమాలను కూడా పెద్దగా ఆదరిస్తున్న టాలీవుడ్ ప్రేక్షకులు, అదే రొటీన్ ఫార్ములా అయితే పెద్ద సినిమాలను కూడా తిరస్కరిస్తున్నారు. మరి “రథం”కు ప్రేక్షకుల నుండి ఎలాంటి స్పందన వస్తుందో తెలియాలంటే మరికొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.



