మాస్ మహరాజా రవితేజ, టాలీవుడ్ సక్సెస్ ఫుల్ నిర్మాత దిల్ రాజుల మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయా? వీరిద్దరి కాంభినేషన్ లో ప్రారంభమైన “ఎవడో ఒకడు” ప్రాజెక్టు నిలిచిపోయిందా? ట్రేడ్ వర్గాల తాజా సమాచారం ప్రకారం… కొన్ని నెలల క్రితం దసరా రోజున లాంచ్ అయిన ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని టాక్. సెట్స్ పైకి వెళ్ళని ఈ సినిమా కధ విషయంలో రవితేజ – దిల్ రాజులు ఏకాభిప్రాయానికి రాలేకపోయారని, అందుకే ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టాలని ఇరువురు నిర్ణయించుకున్నారని సినీ వర్గాలు కోడై కూస్తున్నాయి.
ఈ సినిమాతో అయినా బ్రేక్ వస్తుందని ఆశించిన దర్శకుడు వేణు శ్రీరాంకు మరోసారి నిరుత్సాహం ఎదురైందని, అలాగే ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తారని ప్రకటించిన అనుపమా పరమేశ్వరన్, ప్రజ్ఞా జైస్వాల్ ఆశలు కూడా అడియాసలు అయ్యాయని టాక్. అయితే కధ విషయంలో రాజీ పడని రవితేజ, దిల్ రాజు మధ్య సయోధ్య కుదురుతుందనే ఆశాభావంతో దర్శకుడు ఉన్నట్లుగా తెలుస్తోంది.





