సినిమా దొబ్బింది… అదే నా ఎనర్జీ…!

ravi teja dont want to do experiments with moviesఎన్నో అంచనాలు పెట్టుకున్న సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులు ‘షాక్’ ఇచ్చే తీర్పు ఇస్తే సహజంగా ఎవరైనా ఎలా ఉంటారు? మహేష్ బాబు లాంటి బడా స్టార్స్ అయితే ఏకంగా ఇల్లు వదిలి బయటకు కూడా రారు. ఇక యువ హీరోలైతే మరో సినిమా అవకాశం కోసం ఎదురుచూసే పరిస్థితి! కానీ మాస్ మహారాజా రవితేజకు అయితే, అదే ఎనర్జీ. అవును… సినిమా పోయిందా… నిశ్చింత లేకుండా ఉంటానంటున్నాడు మాస్ మహారాజా.

‘నేలటిక్కెట్టు’ సినిమా ప్రమోషన్ లో భాగంగా చిత్ర దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, హీరోయిన్ మాళవిక శర్మలతో కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ఎనర్జీ’ గురించి మాట్లాడుతూ రవితేజ ఈ వ్యాఖ్యలు చేసారు. “నేను ఏదీ సీరియస్ గా తీసుకొను, సినిమా దొబ్బిందా, ఓకే, వాట్ నెక్స్ట్? అనేదే ఆలోచన, అదే నా ఎనర్జీ కూడా’ అంటూ సింపుల్ గా చెప్పేశారు రవితేజ. ఎనర్జీ అనేది మనిషిని బట్టి ఉంటుందని, తాను చిన్నప్పటి నుండి ఇలాగే ఉన్నానని తెలిపారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories