మాస్ మహారాజా సిక్స్ ప్యాక్ ఫోటోలు!

ravi-teja-six-pack-photosఎప్పుడూ ఒకే తరహా లుక్స్ తో కనపడుతుంటాడని మాస్ మహారాజా రవితేజ వ్యక్తమయ్యే విమర్శలకు కొదవలేదు. అయితే నటన మార్చకపోయినా, లుక్ పరంగా బాగా బక్కచిక్కిన స్వరూపంతో ‘బెంగాల్ టైగర్’ సినిమాలో దర్శనమిచ్చాడు. మునుపటి రవితేజతో పోలిస్తే, మాస్ మహారాజా ముఖంలో కళ తగ్గిపోయిందని కొందరు అభిమానులు వాపోగా, మరికొందరు మాత్రం ఈ లుక్స్ లో కుర్ర హీరోయిన్లు రాశి ఖన్నా, తమన్నాలకు సరైన జోడిగా ఉన్నారని అన్నారు.

విమర్శలు – ప్రశంసలు ఎలా ఉన్నా ఈ లుక్ కోసం రవితేజ తీవ్రంగా శ్రమించాడన్నది మాత్రం వాస్తవం. అయితే ఇపుడు ఏకంగా ఆ శ్రమను సిక్స్ ప్యాక్ లోకి మార్చబోతున్నాడని తెలుస్తోంది. కొత్త దర్శకుడు చక్రి దర్శకత్వం వహిస్తున్న “రాబిన్ హుడ్’ కోసం రవితేజ సిక్స్ ప్యాక్ లోకి మారారని పలు ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఇదే జరిగితే మాస్ మహారాజా అభిమానులకు పండుగ లాంటి వార్తే.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories