ఇరుముడి సక్సెస్ తో వివేక్ ఆత్రేయకి తగ్గిన టెన్షన్

Raviteja & Vivek Athreya’s Film Gets a Boost After Irumudi Success

ప్రతి దర్శకుడికి తాను డైరెక్ట్ చేయబోయే హీరో ఇమేజ్ & సక్సెస్ స్టేట్ అనేది చాలా కీలకం. హీరో గతంలో సాధించిన జయాపజయాలను బట్టి ప్రస్తుతం సినిమా తీయబోయే దర్శకుడు తన సినిమా ఎలా తీయాలి అనేది డిసైడ్ అవుతాడు. నిర్మాతలు కూడా కాస్త డేర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది.

వివేక్ ఆత్రేయ విషయంలో అదే జరిగింది. “సరిపోదా శనివారం” తర్వాత రజనీకాంత్ తో సినిమా అని, నాగార్జునతో సినిమా అని చాలా వార్తలు వచ్చినప్పటికీ.. ఫైనల్ గా రవితేజ-శ్రీవిష్ణుతో ఒక మల్టీ స్టారర్ చేసే అవకాశం దక్కించుకున్నాడు. శ్రీవిష్ణు మరో కీలకపాత్రలో రూపొందనున్న ఆ సినిమాకి “వీరాధి వీరులంట” అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.

ADVERTISEMENT

నిన్న “ఇరుముడి” సినిమాని మార్నింగ్ షో చూసుకున్న వివేక్ ఆత్రేయ పెద్ద టెన్షన్ నుండి బయటపడ్డాడు. రవితేజ పెర్ఫార్మెన్స్ & రూరల్ రోల్ ను ఆడియన్స్ అప్రిషియేట్ చేస్తుండడంతో తాను రాసుకున్న పాత్రలో కూడా రవితేజను యాక్సెప్ట్ చేస్తారనే కాన్ఫిడెన్స్ వచ్చింది. అది మాత్రమే కాకుండా “ఇరుముడి” రిలీజ్ కి ముందు రవితేజకి కంబ్యాక్ ఇవ్వాల్సిన బాధ్యత పూర్తిగా వివేక్ ఆత్రేయ మీద పడింది. అయితే.. ఇప్పుడు ఇరుముడి సక్సెస్ అవ్వడంతో వివేక్ ఆత్రేయ మీద భారం తగ్గి, బాధ్యత పెరిగింది.

అయితే.. తొలుత ఆ సినిమాని ప్రొడ్యూస్ చేయాల్సిన మైత్రీ సంస్థ లాస్ట్ మినిట్ లో తప్పుకుంది. దాంతో వేరే ప్రొడక్షన్ హౌస్ చేజిక్కించుకున్నారు. కాకపోతే.. ఇరుముడి సక్సెస్ తర్వాత మైత్రీ సంస్థ మళ్లీ ఆ సినిమాని తన బ్యానర్ లోనే పట్టాలెక్కించే అవకాశం కనిపిస్తోంది.

మొదట్లో ఈ సినిమాని సంక్రాంతి రేస్ లో ఇరికించాలని ప్రయత్నం జరిగినప్పటికీ.. ఇప్పుడు మాత్రం ఎలాంటి కంగారు లేకుండా సమ్మర్ కి రిలీజ్ చేస్తే బెటర్ అనే ఆలోచనలో ఉన్నాడు వివేక్ ఆత్రేయ. వివేక్ తర్వాత రవితేజ హసిత్ గోలితో మరో సినిమా చేయనున్నాడు. ఇరుముడి తర్వాత ఈ రెండు సినిమాలు సక్సెస్ అయితే మాత్రం.. సెకండ్ ఇన్నింగ్స్ ఆఫ్ రవితేజ మొదలైనట్లే.

ADVERTISEMENT
Latest Stories