వక్కంతం వంశీకి ఇన్నాళ్లకు మంచి రోజులొచ్చాయి

RaviTeja-Vakkantham Vamsi Film Confirmed-వక్కంతం వంశీకి ఇన్నాళ్లకు మంచి రోజులొచ్చాయి

రైటర్ గా వక్కంతం వంశీ పేరు అందరికీ సుపరిచితమే. ఆయన దర్శకుడిగా అవతారం ఎత్తడానికి చాలానే కష్టపడ్డారు. చాలా సంవత్సరాలు ఎన్టీఆర్ వెనుక అవకాశం కోసం తిరిగాడు. అయితే పని అవ్వలేదు. చివరి నిముషంలో అనూహ్యంగా అల్లు అర్జున్ అతనికి అవకాశం ఇచ్చాడు. నా పేరు సూర్య తో డైరెక్టర్ అవతారం ఎత్తిన వంశీ మొదటి సినిమాతోనే ప్లాప్ ని మూటగట్టుకున్నాడు.

ADVERTISEMENT

దీనితో స్టార్ హీరోలు ఎవరూ ఆయనను దగ్గరకు చేరనివ్వలేదు. మొత్తానికి రెండు సంవత్సరాల తరువాత వంశీ తన రెండవ సినిమా సాధించాడు. మాస్ మహారాజా రవితేజ ఇందులో హీరోగా ఉండబోతున్నాడు. ఈరోజు ఈ ప్రకటన వచ్చింది. అయితే ఇందులో హీరోయిన్ ఎవరూ, ఎవరు నిర్మిస్తున్నారు అనేది తెలియాల్సి ఉంది.

మరో వైపు ఇప్పుడు రవితేజ పరిస్థితి కూడా ఏమీ బాలేదు. మొన్న ఆ మధ్య వచ్చిన రాజా ది గ్రేట్ తప్ప ఆయనకు ఈ మధ్య కాలంలో సరైన హిట్లు లేవు. ప్రతి ప్లాప్ తరువాత ఆయన మార్కెట్ కూడా బాగా దెబ్బ తింటుంది. ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం మే 8న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

రవితేజ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వచ్చిన డాన్ శీను, బలుపు సినిమాలు హిట్ కావడంతో ఈ సినిమా మీద అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. మరి రవితేజ ఏం చేస్తారో చూడాలి. ఇది ఇలా ఉండగా రాక్షసుడుతో ఇటీవలే హిట్ కొట్టిన రమేష్ వర్మతో ఇంకో సినిమా చెయ్యబోతున్నట్టు రవితేజ ప్రకటించారు. గతంలో వారిద్దరూ వీర అనే ప్లాప్ సినిమా చేశారు.

ADVERTISEMENT
Latest Stories