భారతీయుడు 2 యాక్సిడెంట్…. నిర్లక్ష్యమే కారణమా?

reasons behind indian2 movie shooting accident-లోకనాయకుడు కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన భారతీయుడు వెండితెరపై ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. కమల్ హాసన్ హీరోగా సెన్సషనల్ దర్శకుడు శంకర్ ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ తీస్తున్నారు. నిన్న రాత్రి చెన్నై శివార్లలో ఒక ఫిల్మ్ స్టూడియో సినిమా షూటింగ్ జరుగుతుండగా ఒక దుర్ఘటన జరిగింది.

ADVERTISEMENT

ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఒక క్రేన్‌ విరిగిపడడంతో ఈ దుర్ఘటన సంభవించింది. శంకర్‌ వ్యక్తిగత సహాయకుడు మధు, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సాయికృష్ణ, ఆహార సరఫరాదారు చంద్రన్‌ మృతిచెందినట్లు సమాచారం. దర్శకుడు శంకర్‌కు కూడా తీవ్ర గాయాలయ్యాయని, ఆయన కాలు విరిగినట్లు వార్తలు వస్తున్నాయి.

మరో పది మంది వరకు గాయపడినట్లు తెలిసింది. అయితే చెన్నై సినీ వర్గాల సమాచారం ప్రకారం టన్నుల బరువు ఉన్న క్రేన్ వాడే సమయంలో తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు సినీ బృందం తీసుకోలేదని, దానితో ప్రాణ నష్టం జరిగిపోయింది. అయితే ఆ విషయంగా ఇబ్బంది పడకుండా లీగల్ గా చిత్రబృందం చర్యలు చేపడుతుంది.

1996 లో విడుదలైన భారతీయుడు సినిమాలో సేనాపతి అనే 70 ఏళ్ల ముసలతను వ్యవస్థలోని అవినీతిపై చేసిన పోరాటాన్ని శంకర్ చూపించాడు. ఇప్పుడు భారతీయుడు 2 లో అదే సేనాపతి 90 ఏళ్ల వయసు వాడిలా కనిపిస్తాడట. భారతీయుడు 2 తన సినీ కేరీర్ లో చివరి సినిమా అని కమల్ ఇప్పటికే ప్రకటించారు.

ADVERTISEMENT
Latest Stories