ఎందుకు కాదన్నావ్ అంటే గడసరి సమాధానం చెప్పిన అమ్మడు

Reasons behind Kiara Advani rejecting telugu moviesభరత్ ఆనే నేను, వినయ విధేయ రామ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన కియారా అద్వానీ తరువాత బాలీవుడ్‌లో బిజీ అయిపోయింది. చాలా కాలం నుండి అనేక తెలుగు చిత్రాల కోసం ఆమెను సంప్రదించినట్లు కానీ ఆమె వాటిని తిరస్కరించిందని పుకార్లు చక్కర్లు కొట్టాయి.

ADVERTISEMENT

అయితే ఈ విషయం పై ఆమె ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. “నేను ఏ తెలుగు సినిమాను ఎప్పుడూ తిరస్కరించలేదు. బాలీవుడ్‌లో నా చేతులు నిండి ఉన్నాయి. డేట్లు సర్దుబాటు చేయడం ప్రధాన సమస్య, అయితే నేను త్వరలో టాలీవుడ్‌లో ఒక పెద్ద సినిమాపై సంతకం చేస్తాను ”అని కియారా వెల్లడించారు.

ఒకరకంగా ఆమె గడుసుగా సమాధానం చెప్పింది అనే చెప్పుకోవాలి. డేట్స్ వల్ల కాదన్న ఇంకో కారణం వల్ల నైన తిరస్కరించడం తిరస్కరించడమే కదా. మరోవైపు… తెలుగులో ఆమె ఇంతకుముందు పనిచేసిన మహేష్ బాబు, రామ్ చరణ్ ల పై ఆమె ప్రశంసలు కురిపించింది.

“వారితో పనిచేయడం నాకు గొప్ప అనుభవం. మహేష్ బాబు చాలా ఫ్రెండ్లీ సూపర్ స్టార్. రామ్ చరణ్ నా బడ్డీ అయ్యారు,” అని ఆమె అన్నారు. పరశురం దర్శకత్వం వహించబోయే మహేష్ బాబు తదుపరి చిత్రం కోసం కియారాను హీరోయిన్ గా అనుకుంటున్నారు. ఆమె అనేక బాలీవుడ్ ప్రాజెక్టులలో కూడా నటిస్తోంది.

ADVERTISEMENT
Latest Stories