రెహానే రక్షించాడు! ఒడ్డున పడ్డ టీమిండియా!

rehane‘స్పిన్’ పిచ్ లతో సఫారీలను పిచ్చెక్కిస్తున్న టీమిండియా, చివరి టెస్ట్ మ్యాచ్ కు కూడా అదే రకమైన పిచ్ తో బరిలోకి దిగింది. మళ్ళీ టాస్ గెలిచిన కోహ్లి బ్యాటింగ్ ఎంచుకోవడంతో, తొలి రోజు ముగిసే సమయానికి టీమిండియా 231 పరుగులు చేసి 7 వికెట్లు నష్టపోయింది. యధావిధిగా ఓపెనింగ్ జోడి నుండి బ్యాట్స్ మెన్ లంతా విఫలం కాగా, ఒక్క అజెంకే రెహానే మాత్రం సత్తా చాటాడు.

మురళి విజయ్ (12), శిఖర్ ధావన్ (33), చటేశ్వర పుజారా (14) పరుగులు మాత్రమే చేయడంతో, స్కోరు బోర్డు 66 కు చేరుకునే సమయానికి 3 వికెట్లు పతనమయ్యాయి. ఆ తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లి, రెహానేలు కాసేపు క్రీజులో నిలద్రోక్కుకుని స్కోర్ ను 100 పరుగులు దాటించారు. ఈ తరుణంలో కోహ్లి (44) పరుగుల వద్ద వెనుతిరగడంతో మళ్ళీ వికెట్ల పతనం ప్రారంభమైంది.

వెనువెంటనే రోహిత్ శర్మ (1), వృద్ధిమాన్ సాహా (1) వెనుతిరగగా, కాసేపు మురిపించిన జడేజా కూడా (24) పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఓ ఎండ్ లో వికెట్లు నేలకూలుతున్నా, రెహానే నిలకడగా బ్యాటింగ్ చేస్తూ భారత్ స్కోర్ ను 200 దాటించాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి రెహానే (89), అశ్విన్ (6) పరుగులతో క్రీజులో ఉన్నారు. సఫారీ బౌలర్లలో అబౌట్ 3, ఫైత్ 4 వికెట్లు తీసుకున్నారు. కనీసం 300 పరుగులు దాటిస్తే, స్పిన్ పిచ్ దృష్ట్యా మ్యాచ్ పై భారత్ ఆధిపత్యం ప్రదర్శించే అవకాశం ఉంది.

ADVERTISEMENT
Latest Stories