టీజర్ – బ్యానర్ స్పెషాలిటీ కనపడుతోంది!

Rendu Rellu Aaru Teaserగత కొన్ని సంవత్సరాలుగా ప్రయోగాత్మక చిత్రాలను నిర్మించే సంస్థగా కీర్తి గడించిన “వారాహి చలన చిత్రం” బ్యానర్ నుండి మరో సినిమా “రెండు రెళ్ళు ఆరు” ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జూన్ 18వ తేదీన విడుదల కాబోయే ఆడియో విడుదలను పురస్కరించుకుని, తాజాగా ఈ సినిమా ఫస్ట్ టీజర్ ను విడుదల చేసారు. మల్లెల నందు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనిల్, మహిమ అనే కొత్త జంట పరిచయం కాబోతున్నారు.

ఓ ప్రేమ జంట పెళ్లిని ఇద్దరి తండ్రులు ఎలా జరగకుండా చేయాలనే సన్నివేశాలను ఫన్నీగా చూపించిన ఈ టీజర్ ఆసక్తికరంగా ఉంది. ముఖ్యంగా వారాహి చలన చిత్రం నుండి రాబోతోంది కాబట్టి, ఖచ్చితంగా ఏదో కొత్తదనంతో ఈ కధ ఉండబోతుందన్న సంకేతాలు టీజర్ లో కనపడుతున్నాయి. అలాగే విజై బుల్గానిన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ సంగీతం ఆకట్టుకునే విధంగా ఉండగా, కొత్త వాళ్ళతో తీసినా ప్రొడక్షన్ వాల్యూస్ లో ఎక్కడా తగ్గలేదనే చెప్పాలి.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories