
ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలకు 20-30 ఏళ్ళ వయో పరిమితి. వారికి పదవీ విరమణ వయసు 60-62 ఏళ్ళు. ఆ వయసులో వారు ఇదివరకులా సమర్ధంగా బాధ్యతలు నిర్వర్తించలేరని కావచ్చు. లేదా తర్వాత తరానికి అవకాశం కల్పించడం కోసం కావచ్చు… పదవీ విరమణకు ఆ వయసు నిర్ధారించారు.
కానీ రాజకీయాలలో ఉన్నవారు కనీసం 60-70 ఏళ్ళు వయసు వరకు ప్రధాని, ముఖ్యమంత్రుల స్థాయికి చేరుకోవడం చాలా కష్టం. అంటే ఉద్యోగులు పదవీ విరమణ చేసే వయసు రాజకీయ నాయకులలకి కీలక పదవులు చేపట్టేందుకు కనీస వయోపరిమితి అనుకోవచ్చు.
అందరూ ఆ వయసులోనే ఆ పదవులు చేపట్టగలరని కాదు. చాలా మంది ఇంకా చిన్న వయసులోనే కీలక పదవులు చేపట్టినవారున్నారు. కానీ చాలా మంది ఆ పదవుల కోసం చేసే ప్రయత్నాలు ఆ వయసు వచ్చే వరకు ఫలించవు.
కనుక రాజకీయాలలో 50 ఏళ్ళ వయసున్నవారిని ‘యువ నాయకులు’గా పరిగణిస్తారు. అలాంటి యువ నాయకుడు రేవంత్ రెడ్డి కాస్త ముందుగా అంటే “54 ఏళ్ళకే సీఎంగా బాధ్యతలు చేపట్టారు.”. ఇప్పుడు ఆయనకి 56 ఏళ్ళు.
ఆ స్థాయి, హోదాలో ఉన్నవారు అప్పుడప్పుడు ప్రజలను రంజింపజేయడానికి బ్యాట్ పట్టుకొని ఫోటోలకు ఫోజులివ్వడం చూస్తుంటాము. కానీ నిత్యం రాజకీయాలలో బిజీగా ఉంటూ తీవ్ర ఒత్తిళ్ళను ఎదుర్కొనే తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి మాత్రం ఎప్పుడు అవకాశం లభించినా హుషారుగా యువకులతో కలిసి మైదానంలో ఫుట్‌బాల్ ఆడుతుంటారు. ఫోటోలకు ఫోజుల కోసం కాదు. నిజంగానే ఆడుతుంటారు. ముఖ్యమంత్రి ఫుట్‌బాల్ ఆడటం అంటే శారీరికంగా మానసికంగా ఆరోగ్యంగా ఉన్నట్లే కదా?
ఇదేమీ గొప్ప విషయం కాకపోవచ్చు, కానీ ముఖ్యమంత్రి అంత చురుకుగా ఉన్నారనే మంచి సంకేతాలు ప్రజలకు, పెట్టుబడిదారులకు వెళతాయి కనుక మంచిదే కదా!
ప్రభుత్వం ఆరోగ్యంగా ఉండాలంటే నేతలు కూడా ఆరోగ్యంగానే ఉండాలి, రేవంత్ అది చూపిస్తున్నారు.
The NDA leadership in Andhra Pradesh has repeatedly raised concerns about alleged attempts to create…
Ram Charan fans have plenty of reasons to be frustrated with Peddi. The film had…