Telugu

పార్టీ మార్పు: ఇందులో అందరికి రేవంత్ ఆదర్శమే..

జీవన్ రెడ్డి సుమారు నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నేతగా, కాంగ్రెస్ పార్టీకి అత్యంత నమ్మదగ్గ నాయకుడిగా అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలోని ఇటు ప్రత్యేక తెలంగాణ రాజకీయాలలోని మోస్ట్ సీనియర్ నాయకుడిగా మంచి గుర్తింపు పొందిన నేత.

అయితే జీవన్ రెడ్డి రాజకీయ ప్రయాణంలో ఆయనకు కాంగ్రెస్ పార్టీకి చాల బలమైన రాజకీయ బంధాలే ఉన్నాయి. జగిత్యాల ఎమ్మెల్యే గా, నాటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం లో మంత్రిగా, అటు పైన ఎమ్మెల్సీ గా ఇలా తన రాజకీయ ప్రయాణంలో సింహ భాగం కాంగ్రెస్ తో కలిసి నడిచారు జీవన్ రెడ్డి.

ADVERTISEMENT

అయితే తాజగా ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి కేసీఆర్ గులాబీ కారెక్కారు. ఈ నెల 20 న జగిత్యాలలో బిఆర్ఎస్ నిర్వహించబోతున్నా బహిరంగ సభలో జీవన్ రెడ్డి అధికారికంగా పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోబోతున్నారు.

ఇంతలోపే జీవన్ రెడ్డి స్వరం పూర్తిగా మారిపోయింది. ఇన్నాళ్లు తనకు రాజకీయ అవకాశాలు కల్పించిన కాంగ్రెస్ పై జీవన్ రెడ్డి పెద్దఎత్తున విమర్శలకు దిగారు. “రేవంత్ పోవాలి కేసీఆర్ రావాలి” అంటూ అప్పుడే కాంగ్రెస్ ఓటమి కోసం బిఆర్ఎస్ గెలుపు కోసం నినాదాలు కూడా మొదలు పెట్టేసారు జీవన్ రెడ్డి.

అసలు దశాబ్దాలుగా ఒక పార్టీ నీడలో రాజకీయం చేస్తూ ఆ పార్టీ మారిన పదిరోజులు కూడా కాకముందే ఇలా మాజీ పార్టీ పైనా ఆ పార్టీ నాయకత్వం మీద రాజకీయ నేతలు విమర్శలు ఎలా చేస్తారు.? చెయ్యగలరు.? అసలు అటువంటి వారి విమర్శలకు విలువుంటుందా.?

ఈ విషయంలో రాజకీయ నాయకులందరికీ రేవంత్ రెడ్డిని చక్కటి ఉదాహరణ గా చూపించవచ్చు. స్వతంత్ర అభ్యర్థిగా తెలంగాణ రాజకీయాలకు పరిచయమైన రేవంత్ అటు పిమ్మట టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఇక రాష్ట్ర విభజనతో తెలంగాణలో టీడీపీ కి భవిష్యత్ కనిపించకపోయే సరికి టీడీపీ ని వీడి కాంగ్రెస్ గూటికి చేరారు.

అయితే రేవంత్ టీడీపీ నుంచి బయటకు వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా ఎన్నడూ, ఏ రాజకీయ వేదిక మీద కూడా టీడీపీ పై ఎటువంటి రాజకీయ విమర్శలు చేయలేదు, టీడీపీ పార్టీ నాయకత్వం మీద ఎటువంటి ఆరోపణలు గుప్పించలేదు.

కేవలం తన రాజకీయ అవసరాల కోసమే టీడీపీ ని వీడి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నానని, అందుకోసం టీడీపీ ని కానీ టీడీపీ అధినాయకత్వాన్ని కానీ నిందించాల్సిన అవసరం లేదంటూ రేవంత్ ఇప్పటికి టీడీపీ పార్టీకి విధేయుడిగానే, బాబు మంచి కోరుకునే వ్యక్తిగానే ఉండిపోయారు.

కానీ ప్రస్తుత కాలంలో అటువంటి రాజకీయ విలువలు ఉన్న నాయకుడు మచ్చుకైనా కనిపించడం లేదంటే అతిశయోక్తి కాదేమో. అంతెందుకు నిన్నమొన్నటి వరకు బిఆర్ఎస్ ప్రభుత్వంలో భాగమై, తండ్రి చాటు బిడ్డగా ఉన్న కవిత కూడా బిఆర్ఎస్ పార్టీ మీద ఆ పార్టీ ముఖ్య నేతల నుంచి పార్టీ అధినేత వరకు అందరి మీద విమర్శలు చేస్తూ ముందుకెళ్తుంది.

ఇటువంటి తరుణంలో పార్టీ మార్పుల విషయంలో రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణం అందరికి ఆదర్శప్రాయమనే చెప్పాలి. ఇటువంటి రాజకీయాలకు ప్రజల నుంచి కూడా మంచి మద్దతు లభిస్తుందనేది రేవంత్ రాజకీయంగా ఎదిగిన తీరుకు ప్రత్యక్ష నిదర్శనం.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

WC Winning Captain’s Career Flop? First India, Now Nowhere

Suryakumar Yadav’s career has taken another unexpected turn. After being left out of all three…

14 minutes ago

ఏపీ అభివృద్ధి వార్తలను అవినీతి కేసులు మింగేస్తున్నాయే!

అభివృద్ధి గురించి ఆలోచించాలంటే అమరావతి, పోలవరంతో సహా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మౌలిక వసతుల అభివృద్ధి, కొత్తగా ఏర్పాటవుతున్న పరిశ్రమలు,…

25 minutes ago