
కేసీఆర్ కి హరీష్ కట్టప్ప వంటి వాడు అంటూ గత కొన్నేళ్లుగా తెలంగాణ రాజకీయాలలో గట్టి ప్రచారమే జరుగుతుంది. హరీష్ ఏదొక రోజు బిఆర్ఎస్ పార్టీని రెండుగా చీల్చి తన వర్గం నేతలను తీసుకుని గులాబీ జెండాకు వెన్నుపోటు పొడవడం తప్పదు అంటూ ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్ నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన మాట వాస్తవమే.
అలాగే బిఆర్ఎస్ నుంచి బయటకొచ్చిన కవిత కూడా హరీష్ ని బిఆర్ఎస్ కోవర్ట్ గా కేసీఆర్ కట్టప్ప గా అభివర్ణిస్తూ ఎదోకరోజు హరీష్, కేసీఆర్ బిఆర్ఎస్ ను బీజేపీ లో విలీనం చేయడం ఖాయమంటూ ఆరోపించారు. అలాగే నేటి నా ఈ పరిస్థితే రేపటి రోజున అన్న కేటీఆర్ కి తండ్రి కేసీఆర్ కి కూడా ఎదురుకాక తప్పదు అందు హరీష్ ని గుంటనక్కతో పోల్చారు కవిత.
ఇక ఇప్పుడు తాజగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం హరీష్ అతి తొందరలో బిఆర్ఎస్ జెండా పీకేసి బీజేపీ జెండా ఎత్తుకోబోతున్నారని, ఆదిశగా హరీష్ ఇప్పటికే బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపారని పేర్కొండడంతో మరోసారి హరీష్ రావు పొలిటికల్ జర్నీ పై ఊహాగానాలు, అనుమానాలు మొదలయ్యాయి.
తానూ చేసిన ఈ ప్రకటన వాస్తవం కాదని భద్రాద్రి రాముని ఎదుట, మీ మామ కేసీఆర్ మీద ప్రమాణం చేసి చెప్పగలవా.? అంటూ హరీష్ కి సీఎం రేవంత్ సవాల్ విసిరారు. అయితే గతంలోనే హరీష్ అసలు రంగు బయటపడడంతో కేసీఆర్ హరీష్ ని పార్టీకి కార్యక్రమాలు దూరం పెట్టారని,
కేసీఆర్ రెండవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత సుమారు ఒక ఏడాది పాటు హరీష్ ని మంత్రి వర్గంలోకి తీసుకోలేదన్న సంగతి ఒక్కసారి గుర్తు చేసుకోవాలంటూ బిఆర్ఎస్ క్యాడర్ కి సూచన చేసారు రేవంత్. ఇక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లి ప్రాజెక్ట్ వద్దకు హరీష్ ని ఎందుకు వెంటబెట్టుకుపోలేదంటూ ఎదురు ప్రశ్న వేశారు.
అయితే బిఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా కేటీఆర్ vs హరీష్ కేంద్రంగా ఆధిపత్య రాజకీయ పోరు సాగుతుందనేది సొంత పార్టీ క్యాడర్ కూడా ఒప్పుకునే వాస్తవమే. కేసీఆర్ వారసుడిగా కేటీఆర్ పార్టీ పగ్గాలు చేపట్టకపోవడానికి, ఇప్పటికి బిఆర్ఎస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేటీఆర్ పేరు బయటకు రాకపోవడం వెనుక జరిగే తెరవెనుక రాజకీయం కూడా ఇదే అంటూ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతూ ఉంటుంది.
అయితే ఇప్పుడా ప్రచారానికి రేవంత్ తన ప్రకటన తో పెట్రోల్ పోశారు. మరి రేవంత్ సవాల్ కి సై అంటూ హరీష్ ముందుకొచ్చి భద్రాద్రి రాముని సాక్షిగా తన శీల పరీక్ష నిరూపించుకుంటారా.? ఇక బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్న ఈ ఆరోపణల పై సమాధానం చెప్పేందుకు ఆసక్తి చూపిస్తుందా.? అనేది చూడాలి.
The wait is finally over! The makers of Ramayana, backed by producer Namit Malhotra, have…
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…