టాలీవుడ్‌ సందేశాన్ని రేవంత్ రెడ్డే డీకోడ్ చేసుకోవాలి!

అల్లు అర్జున్‌ అరెస్టుపై తెలుగు సినీ పరిశ్రమలో పెద్దగా స్పందించలేదు కానీ దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. శనివారం ఉదయం అల్లు అర్జున్‌ ఇంటికి తిరిగి వచ్చినప్పటి నుంచి సినీ పరిశ్రమలో దాదాపు ప్రతీ ఒక్కరూ జూబ్లీహిల్స్‌లో ఆయన నివాసానికి వచ్చి పరామర్శించి, సంఘీభావం తెలిపి వెళుతున్నారు.

సినీ పరిశ్రమ నుంచి ఇంత మద్దతు లభిస్తుందని బహుశః అల్లు అర్జున్‌ కూడా ఊహించి ఉండరు. కానీ సినీ పరిశ్రమ మొత్తం తన కోసం కదిలి రావడం చూసి అల్లు అర్జున్‌, కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఉన్నారు. ఆ షాక్ నుంచి త్వరగా తెరుకొని ధైర్యంగా మాట్లాడుతున్నారిప్పుడు.

ADVERTISEMENT

మెగా-అల్లు కుటుంబాల మద్య మనస్పర్ధలను పక్కన పెట్టి చిరంజీవి దంపతులు అల్లు అర్జున్‌ ఇంటికి వెళ్ళి పరామర్శించి ధైర్యం చెప్పి వచ్చారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ కూడా బహుశః నేడు అల్లు అర్జున్‌ ఇంటికి వెళ్ళి కలిసే అవకాశం ఉంది.

సినీ పరిశ్రమ ప్రముఖులు నేటికీ అల్లు అర్జున్‌ ఇంటికి క్యూ కడుతుండటం బహుశః సిఎం రేవంత్ రెడ్డికి, మంత్రులకు చాలా ఇబ్బందికరంగా అనిపించవచ్చు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తప్పని, దానిని సినీ పరిశ్రమ ముక్త కంఠంతో ఖండిస్తోందని టాలీవుడ్‌ స్పష్టమైన సంకేతం పంపినట్లే భావించవచ్చు.

కనుక ఈ కధ ఇక్కడితో నిలిపివేస్తుందా లేక చట్టం తన పని తాను చేసుకుపోతుందని డైలాగ్ చెప్పి, తదుపరి చర్యలకు సిద్దపడుతుందా?అనేది రాబోయే రోజుల్లో చూడవచ్చు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

BB Telugu: Meluko Rohith Meluko

After the wild-card contestants enter, the basic expectation is that the existing contestants take the…

29 minutes ago

Jailer 2 Hindi: OTT Destroyed Hrithik Roshan’s Cameo?

Jailer 2 is scheduled to arrive in theatres this week. However, the makers have opted…

60 minutes ago