రేవంత్ రెడ్డిని కేసీఆర్‌ తక్కువ అంచనా వేశారా?

కేసీఆర్‌ ఫామ్‌హౌసులో కూర్చొని శాసనసభ సమావేశాలలో 22ఏ నిషేదిత భూముల వ్యవహారంపై అద్భుతమైన వ్యూహం రచించి సిఎం రేవంత్‌ రెడ్డిని శాసనసభ వేదికగా ప్రజల దృష్టిలో దోషిగా నిలబెట్టాలని అనుకున్నారు.

కానీ సిఎం రేవంత్‌ రెడ్డి చేతిలో రెండుసార్లు (శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో) ఎదురుదెబ్బలు తిని రెండున్నరేళ్ళుగా ఫామ్‌హౌసులో నుంచి అడుగు బయట పెట్టలేకపోతున్న కేసీఆర్‌, మళ్ళీ రేవంత్ రెడ్డిని చాలా తక్కువ అంచనా వేశారని స్పష్టమవుతోంది.

ADVERTISEMENT

కేసీఆర్‌ కుటుంబం మాత్రమే కాక మైహోం రాజేశ్వరరావు వంటివారికి శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఏకంగా 2,400 ఎకరాలు కట్టబెట్టారనే విషయం సిఎం రేవంత్‌ రెడ్డి శాసనసభలో బయట పెట్టడంతో కేసీఆర్‌ & కో కంగుతిన్నారు.

ఆయన కుమార్తె కల్వకుంట్ల కవిత కూడా ఓ పది మంది బీఆర్ఎస్‌ ముఖ్య నేతలు కూడా బాగానే భూములు సంపాదించుకున్నారని, వారి భూములపై కూడా సీబీఐ చేత విచారణ జరిపించాలని కోరడంతో, సిఎం రేవంత్‌ రెడ్డి చేస్తున్న ఆరోపణలు వాస్తవమే అని ఆమె కూడా ధృవీకరించినట్లయింది.

కేసీఆర్‌ హయంలో అభివృద్ధి పనుల పేరుతో గ్రామాలలో తమ భూములను ఏవిధంగా గుంజుకున్నారో, ఆంధ్రావాళ్ళను బెదిరించి హరీష్‌ రావు తదితరులు ఏవిధంగా గుంజుకున్నారో బాధిత బడుగు బలహీన వర్గాలకు చెందిన రైతులు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి చెపుతున్నారు.

చివరికి ఊళ్ళలో నిరుపేదలు సైతం కేసీఆర్‌ హయంలో ఈ భూదోపిడీ జరగడం నిజమేనని చెపుతుండటం గమనిస్తే, సిఎం రేవంత్ బీఆర్ఎస్‌ పార్టీపై లక్ష్మీ బాంబు కాదు.. ఏకంగా అణుబాంబు వేసినట్లే అనిపిస్తుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

Sneha In Kaaka? This Casting Buzz Is Interesting

A new casting buzz around Chiranjeevi’s Kaaka is getting attention. Actress Sneha is reportedly joining…

7 minutes ago

ఇంత అలవోకగా తెలంగాణలో డైవర్షన్ పాలిటిక్స్!

రాజకీయాలలో ఒక సమస్య లేదా అంశం మీద నుంచి మరో దానికి చర్చ, ప్రజల దృష్టిని ఎంత అలవోకగా మార్చవచ్చో…

20 minutes ago