
ప్రచార పర్వం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ బిఆర్ఎస్ పైన పై చెయ్యి సాధిస్తూనే వచ్చింది. అలాగే పోలింగ్ ముగిసిన తరువాత వచ్చే ఎగ్జిట్ పోల్స్ లో కూడా హస్తం పార్టీ హవా నడుస్తుండడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులలో పార్టీ గెలుపు పై ధీమా పెరిగింది.
అలాగే కార్యకర్తలు ఎవరు అధైర్య పడవద్దు అంటూ చెప్పిన కేటీఆర్ వాయిస్ లో ఢీలా కూడా కనపడింది. ముందునుంచి వాస్తవానికి దగ్గరగా ఆలోచించే కేటీఆర్ పది ఏళ్ళ ప్రభుత్వ వ్యతిరేకత మా పార్టీ గెలుపు పై ప్రభావం చూపే అవకాశం ఎక్కువగానే ఉంది అంటూ పలు టీవీ ఛానెల్స్ కి ఇచ్చిన ఇంటర్ వ్యూలలో చెప్పుకొచ్చారు.
తండ్రి దిగకుండా కొడుకు మీడియా ముందుకు వచ్చినాడంటేనే అర్ధమవుతుంది తెలంగాణలో ఇక కేసీఆర్ దుకాణం బందు అయ్యిందని.,అలాగే బిఆర్ఎస్ పార్టీకి 25 సీట్లకు మించి రావని ఎప్పుడు తన అంచెనా తప్పలేదని ఈసారి కూడా తప్పదని గెలుపు పై ధీమాగా ఉన్నారు రేవంత్.
ఈ ఎన్నికలలో బిఆర్ఎస్ ఓడిపోతే కేటీఆర్ తిరిగి అమెరికాకు పోవడం, కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితం అవ్వడం కాయం అంటూ విమర్శలు చేశారు. రేవంత్ గెలుపు పై ఇంతలా ధీమాగా ఉండడానికి ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్స్ కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. అన్ని ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్స్ లో దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించడానికి అవసరమైన స్థానాలు దక్కించుకుంటుంది అని రావడంతో కాంగ్రెస్ పార్టీ నేతలలో ఉత్సహం రెట్టింపయ్యింది.
అలాగే బిఆర్ఎస్ నాయకులలో ఓటమి భయం మొదలయ్యింది. తెలంగాణ ప్రజలు వన్ సైడ్ గా కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడితే తప్పా హాంగ్ వస్తే ఇప్పుడు ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ నేతలకు నిరాశే మిగులుతుంది.అధికారం కోసం ఎవరితో అయినా పొత్తు పెట్టుకోగలిగిన కేసీఆర్ అందుకు సిద్దంగానే ఉంటారు.ఒక వేళ అదే జరిగి బిఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తే మొదటగా రాజకీయంగా దెబ్బతినడానికి సిద్ధంగా ఉండాల్సింది కూడా రేవంత్ రెడ్డి.
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…