రేవంత్: హైద్రాబాద్ ఐటీ రంగానికి పునాది చంద్రబాబే..!

వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఐటీ రంగాన్ని పరిచయం చేసిన ఘనత చంద్రబాబు నాయుడిదే అనేది ప్రత్యర్థి పార్టీల నేతలు సైతం అంగీకరించిన వాస్తవం. ఉమ్మడి ఏపీలో తెలంగాణకు ఐటీ రంగాన్ని తీసుకువచ్చి సైబరాబాద్ అనే ఒక మహానగరాన్ని నిర్మించిన హైద్రాబాద్ ను ప్రపంచ పటంలో నిలిపారు చంద్రబాబు.

ADVERTISEMENT

దీనిని అంగీకరించడానికి ఏమాత్రం సంశయించనవసరం లేదని గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న ఐటీ మంత్రి కేటీఆర్ పలుమార్లు నొక్కి వక్కాణించారు. ఇప్పుడు ఇదే విషయాన్నీ మరోసారి గుర్తుచేసుకున్నారు ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అవును ప్రపంచదేశాలు తిరిగి హైద్రాబాద్ కు ఐటీ రంగాన్ని తీసుకువచ్చినది ఆనాటి టీడీపీ ప్రభుత్వం లో ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు అంటూ మాజీ ముఖ్యమంత్రి పై ప్రస్తుత ముఖ్యమంత్రి కామెంట్ చేసారు.

ఐటీ రంగం ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు వచ్చాయి. అటువంటి వారు ఉన్నత స్థాయిలో స్థిరపడి మంచి భవిష్యత్ ను పొందగలిగారు. అయితే బాబుతో రాజకీయ విభేదాలు ఉన్నప్పటికినీ తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వైస్సార్ కూడా ఆ పాలసీలను ముందుకు తీసుకు వెళ్లారు. దీనివలన హైద్రాబాద్ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందింది అంటూ గత పాలకుల వ్యవహార శైలిని కొనియాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

హైద్రాబాద్ ఐటీ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర పునాదుల నుంచి స్లాబుల వరకు ఉందని ఎంతమంది నాయకులు బలంగా చెపుతున్నప్పటికీ ”చెవులుండి చెవిటి వారులా, కళ్లుండి గుడ్డివారిలా, నోరుండి మూగవారిలా” నటించడం మాత్రం ఒక్క వైసీపీ నాయకులకే చెల్లింది. దీనికి తోడు ఎవరైనా బాబు గురించి ఈ తరహా వ్యాక్యలు చేస్తే వారి పై మీడియా ముందుకు వచ్చి వారి అధికారిక భాషా ప్రయోగించి బెదిరించడంలో వైసీపీ మాత్రం ముందు వరుసలో ఉంటుందనేది రజనీకాంత్ విషయంలో రుజువుచేసారు.

మరి రేవంత్ పై కూడా తమ మాటల దాడిని కొనసాగించి ఎన్నికల ముందు కొత్త శత్రువులను కోరుండి తెచ్చుకుంటారా..? లేక కేటీఆర్ కు ఇచ్చిన మినహాయింపే రేవంత్ కు ఇచ్చి గమ్మున ఉండిపోతారా..? అనేది చూడాలి. చరిత్ర అనేది ఎవరికి నచ్చినా నచ్చకున్నా ఒప్పుకోవాల్సిన వాస్తవం. దీనిని తమ మాటల దాడితోనో, బెదిరింపులతోనో, అధికారం ఉంది అనే అహంకారంతోనో చెరిపేయాలని చూసిన చెక్కు చెదరనిది.

వైస్సార్ ఆరోగ్య శ్రీ ఎలా అయితే ఎంతోమంది పేదవారి ప్రాణాలు కాపాడిందో అలాగే చంద్రబాబు విజనరీతో తీసుకువచ్చిన ఐటీ పరిశ్రమలు కూడా అంతే మందికి మంచి జీవితాన్ని, బంగారు భవిష్యత్తు ని ఇచ్చింది. పునాది వేసినవాడు ఆ పునాది రాళ్లను పైకి తీసుకువెళ్లినవాడు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే రాజకీయ నాయకులవుతారు. అలాకాకుండా కూల్చివేతలతో కాలం వెళ్లబుచ్చే వాడు ఒకటి..రెండు..మూడు..అంటూ అంకెలగారడి చేయాల్సిందే అనేది చరిత్ర చెప్పిన పాఠమే.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Southern India’s Water War: CBN’s Biggest Challenge Ahead

Water is becoming a major political and economic challenge for southern India. Andhra Pradesh, Telangana,…

8 minutes ago

Vijay Deverakonda Confident About Ranabaali

Ranabaali, starring Vijay Deverakonda and Rashmika Mandanna, is among the upcoming pan-India releases of the…

12 minutes ago