
పండక్కి చెల్లిని ఇంటికి పిలిచి చీర కూడా పెట్టలేని వాళ్ళు కూడా నన్ను విమర్శిస్తారా.? నా తోలు తీస్తా అంటూ బెదిరిస్తారా అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ వ్యాఖ్యలను ఉద్దేశించి కొండగల్లు సభలో కౌంటర్ వేశారు.
ఆస్తిలో చెల్లికి వాటా ఇవ్వాలని, పార్టీలో చెల్లికి రాజకీయ ప్రాధాన్యం కల్పించాలని సొంత తోడబుట్టిన చెల్లిని సైతం బయటకు పంపించిన వారు నాకు రాజకీయ నీతులు చెపుతున్నారు, అటువంటి వారు తన పై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఒక దెబ్బకి రెండు పిట్టలు మాదిరి అటు కేటీఆర్ కి ఇటు వైసీపీ అధినేత వైస్ జగన్ కి గుచ్చుకున్నాయి.
ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఉంటున్న షర్మిల పై వైస్ జగన్ చేస్తున్న రాజకీయ దాడి, వైసీపీ పెడుతున్న మానసిక క్షోభ కూడా జగన్ ను ఇదే విధంగా దూషిస్తుంది. అలాగే అటు తెలంగాణలో సైతం కల్వకుంట్ల కుటుంబంలో రేగిన రాజకీయ చిచ్చు ప్రత్యర్థి పార్టీలకు ఒక ఆయుధంగా మారింది.
ఈ నేపథ్యంలో రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలు నువ్వెంత నీ స్థాయేంత.? పార్టీ నుంచి చెల్లిని మెడపట్టి బయటకు పంపిన నువ్వు సొంత చెల్లికి సమాధానం చెప్పలేకపోయావ్, అటువంటి నువ్వు నాకు సవాల్ విసురుతావా అంటూ రేవంత్ కేటీఆర్ పై ధ్వజమెత్తాడు.
అయితే రేవంత్ కేటీఆర్ పై సంధించిన రాజకీయ విమర్శలు ఇటు జగన్ కి కూడా ఆపాదిస్తూ సోషల్ మీడియాలో అప్పుడే వైసీపీ ని ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ అన్న – చెల్లెళ్ళ వివాదంలో మాత్రం అటు వైసీపీ ఇటు బిఆర్ఎస్ ప్రత్యర్థి పార్టీలకు గట్టిగా చిక్కుకున్నాయనే చెప్పాలి.
ఇక్కడ జగన్ ఓటమి కోసం షర్మిల అక్కడ కేటీఆర్ పతనం కోసం కవిత ప్రత్యక్ష పోరాటాలు చేస్తుంటే, అటు షర్మిల మీద జగన్, కవిత కేటీఆర్ పరోక్ష పోరు సారిస్తున్నారు. ఈ ఇద్దరు ఈ విషయంలో ఎప్పుడు ప్రత్యర్థుల నోటికి తలవంచాల్సిందే, ప్రజల ముందు ఆడబిడ్డలకు అన్యాయం చేసిన అన్నలుగా మిగలాల్సిందే..!
Ramayana Part 1 is arriving in a month. The movie has already created buzz with…
NTR fans are growing anxious about Trivikram’s ambitious mythological project, tentatively titled God of War,…