గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 100 సీట్లు కైవసం చేసుకుంటే తానూ రాజకీయ సన్యాసం చేస్తానని రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన గుర్తుందా? అలాగే టీఆర్ఎస్ పార్టీకి 100 సీట్లు వస్తే తన చెవి కోసుకుంటానని సీపీఐ నారాయణ చేసిన వ్యాఖ్యలు గుర్తున్నాయా? ఒక గుర్తుకు రాకపోతే ప్రస్తుతం టీఆర్ఎస్ వర్గాలు ఇవే వ్యాఖ్యలను గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.
టీఆర్ఎస్ పార్టీ 100 స్థానాలను దాటించడంతో పాటు టిడిపి కూటమిని కేవలం సింగిల్ డిజిట్ కే పరిమితం చేసారు గ్రేటర్ ఓటర్లు. అలాగే కాంగ్రెస్ పార్టీది కూడా మరింత దయనీయమైన పరిస్థితి. మరి ఈ పరిస్థితులను ఆయా పార్టీ వర్గాలు ఎలా విశ్లేషించుకుంటాయో గానీ, ప్రస్తుతం నారాయణ చెవి – రేవంత్ రాజకీయ భవిష్యత్తు హాట్ టాపిక్ అయ్యాయి.
ADVERTISEMENT
ADVERTISEMENT





